https://oktelugu.com/

Venkatesh : హీరో నితిన్ నిర్మాతగా విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వెంకటేష్ తో అనిల్ రావిపూడి ఎఫ్2 ,ఎఫ్3 వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 20, 2024 / 04:59 PM IST

    Venkatesh- Anil Raavipudi

    Follow us on

    Venkatesh :  ఆరు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ, అభిమానులను, నేటి తరం యూత్ ఆడియన్స్ ని అలరింపచేస్తూ సూపర్ హిట్స్ ని అందుకుంటున్న హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా ఆయన ‘సైంధవ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో వెంకటేష్ తో ఈయన ఎఫ్2 ,ఎఫ్3 వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు, రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అవ్వబోతుండడంతో వెంకటేష్ చిత్రాన్ని డిసెంబర్ 20 వ తారీఖున విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తన తదుపరి చిత్రానికి కూడా పచ్చ జెండా ఊపినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ తమిళ దర్శకుడు టీఎన్ సంతోష్ ఇటీవలే వెంకటేష్ ని కలిసి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథని వినిపించాడట. ఈ కథ వెంకటేష్ కి తెగ నచ్చేసిందని సమాచారం. ప్రముఖ యంగ్ హీరో నితిన్ ఈ చిత్రాన్ని తన ‘శ్రేష్ఠ మూవీస్’ బ్యానర్ పై నిర్మించబోతున్నాడని ఇండస్ట్రీ లో ఇప్పుడు ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో వెంకటేష్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది.

    విక్టరీ వెంకటేష్ నుండి పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ తో సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో ఆయన ‘ఘర్షణ’ చిత్రం లో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించాడు. ఆ తర్వాత వెంకటేష్ నుండి పోలీస్ స్టోరీగా బాబు బంగారం అనే చిత్రం వచ్చింది. ఇది ‘ఘర్షణ’ తరహాలో పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ కాదు, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆయన ‘ఘర్షణ’ తరహా పవర్ ఫుల్ కథతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి. వచ్చే ఏడాది జనవరి నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ లో ఎంత ఆసక్తి కలిగిస్తుంది అనేది.