Skin: చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

Skin: మంచి ఆరోగ్యానికి చర్మం యవ్వనంగా కనిపించడం కూడా ఒక సంకేతం అనే సంగతి తెలిసిందే. మాయిశ్చరైజింగ్, టోనింగ్ తో పాటు మరికొన్ని పద్ధతులను పాటించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. చర్మ రకాన్ని బట్టి ఉత్పత్తులను వినియోగించాలి. ఎండలో వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్ వినియోగించాలి. చర్మానికి హాని చేసే కెమికల్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖం, శరీరం […]

Written By: Kusuma Aggunna, Updated On : July 23, 2022 4:05 pm

Skin

Follow us on

Skin: మంచి ఆరోగ్యానికి చర్మం యవ్వనంగా కనిపించడం కూడా ఒక సంకేతం అనే సంగతి తెలిసిందే. మాయిశ్చరైజింగ్, టోనింగ్ తో పాటు మరికొన్ని పద్ధతులను పాటించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. చర్మ రకాన్ని బట్టి ఉత్పత్తులను వినియోగించాలి. ఎండలో వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్ వినియోగించాలి.

చర్మానికి హాని చేసే కెమికల్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖం, శరీరం కొరకు వివిధ మాయిశ్చరైజర్‌లు, ఎక్స్‌ఫోలియేటింగ్ క్రీమ్‌లను వినియోగించాలి. మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగటంతో పాటు మొటిమల సమస్య ఉన్నవాళ్లు ప్రత్యేక టవల్ ను వినియోగిస్తే మంచిది. కచ్చితమైన డైట్ ను తప్పనిసరిగా ఫాలో కావాలి. కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెర, స్వీట్లకు దూరంగా ఉంటే మంచిది.

చక్కెర శరీరంలో కొల్లాజెన్ ను తగ్గించి వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే అవకాశాలు ఉంటాయి. గ్లూకోజ్ గ్లైకోజెన్ అనే ప్రక్రియను వేగవంతం చేసి అకాల వృద్ధాప్యానికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. విటమిన్ ఈ పుష్కలంగా ఉండే పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె గింజలను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. నారింజ, ద్రాక్ష, బెర్రీలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

నట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వాల్‌నట్స్, హాజెల్ నట్స్, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, అత్తి పండ్లు, వేరుశనగలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శాఖాహారులు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే చర్మం బిగుతుగా ఉండే అవకాశం ఉంది.