Homeఎంటర్టైన్మెంట్ఆ గొప్ప నటి పరిస్థితి కన్నీళ్ల మయం !

ఆ గొప్ప నటి పరిస్థితి కన్నీళ్ల మయం !

సీనియర్‌ నటి ‘సవితా బజాజ్‌’.. ఒకప్పుడు హిందీలో ఒక వెలుగు వెలిగిన నటి. ఆమె నటనా చాతుర్యం తెలియాలంటే.. ‘నిశాంత్‌’, ‘నజ్రానా’, ‘బెటా హోతో ఐసా’ వంటి సినిమాల్లో ఆమె పాత్రలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. పైగా ఆమె లెజెండరీ నటీమణులకు సరిసమానంగా గుర్తింపు తెచ్చుకున్న నటి. మరి అంత గొప్ప నటి ప్రస్తుత పరిస్థితి కన్నీళ్ల మయం అయిపోయింది. గత కొంతకాలంగా ‘సవితా బజాజ్‌’ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కష్టాల సుడిగుండంలో ‘సవితా బజాజ్‌’ చిక్కుకుని అల్లాడిపోతుంది. […]

Savita Bajaj in Financial Crisisసీనియర్‌ నటి ‘సవితా బజాజ్‌’.. ఒకప్పుడు హిందీలో ఒక వెలుగు వెలిగిన నటి. ఆమె నటనా చాతుర్యం తెలియాలంటే.. ‘నిశాంత్‌’, ‘నజ్రానా’, ‘బెటా హోతో ఐసా’ వంటి సినిమాల్లో ఆమె పాత్రలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. పైగా ఆమె లెజెండరీ నటీమణులకు సరిసమానంగా గుర్తింపు తెచ్చుకున్న నటి. మరి అంత గొప్ప నటి ప్రస్తుత పరిస్థితి కన్నీళ్ల మయం అయిపోయింది.

గత కొంతకాలంగా ‘సవితా బజాజ్‌’ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కష్టాల సుడిగుండంలో ‘సవితా బజాజ్‌’ చిక్కుకుని అల్లాడిపోతుంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే, ఆమె ఇంత కష్టపడుతున్నా.. ఆమెను ఆదుకునేందుకు అయిన వాళ్లు కూడా ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరమైన విషయం. తినడానికి కూడా తిండి లేక పస్తులు పడుకుంటుంది.

గతంలో ఆమె ఎందరో అభాగ్యులను ఆదుకుంది. వారి కడుపు నింపింది. అలాంటి తనకు ఈ రోజు తిండి కూడా లేక మూగగా రోదిస్తోంది. తన దీన పరిస్థితిని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ.. ‘నా జీవితం బావి తరాల వారికి గుణపాఠం. నా సంపాదన మొత్తం ఊడ్చుకు పోయింది. నా కనీస అవసరాల కోసం దాచుకున్న డబ్బంతా నా వైద్యం కోసమే ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

అయినా, నా అనారోగ్య సమస్యలు ఇంకా తీరలేదు. ప్రస్తుతం నాకు శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది’ అంటూ ఉబికొస్తున్న కన్నీళ్లు కనుగ్రుడ్డు చాటున అణుచుకుంటూ.. ‘ఇప్పుడేం చేయాలో కూడా నాకు తెలియడం లేదు’ అని ఆమె మనసులోనే కుమిలిపోయింది. పాపం ‘సవితా బజాజ్‌’కు ముంబైలో సొంతిల్లు కూడా లేదు.

ఆమె ప్రస్తుతం ఒక చిన్న కిచెన్‌ రూమ్‌ లో అద్దెకుంటూ ఆ రూమ్ రెంట్ కూడా కట్టలేని పొజిషన్ లో ఉంది. ఇక తన ఆరోగ్యం సహకరించక పోవడం వల్ల తిరిగి నటిస్తానన్న నమ్మకం లేదు అంటూ ఆమె బాధగా చెబుతున్న మాటలకు ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper