
క్రమం తప్పకుండా ఆడితే హార్దిక్ పాండ్య జట్టుకు ఆస్తిగా మారతాడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివ రామకృష్ణన్ అన్నారు. అతడు పూర్తిగా ఫిట్ నెస్ సంతరించుకోవాలని సూచించాడు. యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని తర్వాత ప్రమాదకర ఫినిషర్ గా మారే అవకాశం ఉందన్నాడు. ఫిట్ నెస్ పెంచుకొని బౌలింగ్ చేయడం మొదలు పెట్టగానే హార్థిక్ పాండ్య కీలకంగా మారతాడు. కొన్నేళ్ల తర్వాత జట్టుకు సమతూకం తెచ్చే పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ దొరికాడు. బ్యాంటింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు మనకెవరూ లేరు అని శివరామకృష్ణన్ అన్నారు.