Homeఎంటర్టైన్మెంట్Venu Swamy: విడాకుల బాటలో మెగా జంట నడవనుందా..?

Venu Swamy: విడాకుల బాటలో మెగా జంట నడవనుందా..?

నాగ చైతన్య - సమంత విడిపోతారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది. రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించి పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Venu Swamy: చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ కొందరు తారలు తమ భాగస్వాముల నుంచి విడిపోయారు.. ఈ తరహాలోనే ఇటీవల నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే నాగ చైతన్య – సమంత విడిపోతారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది. రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించి పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది..దీంతో వేణుస్వామిని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జ్యోతిష్యులు వేణుస్వామి మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. మెగా ఫ్యామిలీలో ఓ జంట విడిపోతారంటూ ఆయన కామెంట్స్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మాట్లాడుతూ ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలు విడిపోతారని తెలిపారు. జాతక రీత్యా గ్రహాలు సరిగా లేవన్న ఆయన వారు కలిసి ఉండలేరని వ్యాఖ్యానించారు. అంతేకాదు నాగచైతన్య – సమంత తరహాలోనే వరుణ్ – లావణ్య విడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. దీంతో వేణుస్వామిపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper