Venu Swamy and Allu Arjun : ఎల్లప్పుడూ సెలబ్రిటీల జాతకాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ట్రెండింగ్ లో ఉండే జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy). ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాడు. మహిళా కమీషన్ ముందు నిలబడి క్షమాపణలు చెప్పి, ఇక మీదట సెలబ్రిటీల జాతకాలు బహిరంగంగా చెప్పను అంటూ చెప్పుకొచ్చాడు. అంతకు ముందు కూడా ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో జగన్ మరోసారి సీఎం అవుతాడని చెప్పి, ఫలితాలు తారుమారు అవ్వడంతో ఇక మీదట బహిరంగంగా ఇలాంటి జాతకాలు చెప్పను అంటూ చెప్పుకొచ్చిన వేణు స్వామి, కేవలం రెండు నెలల్లోనే నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala) నిశ్చితార్థం చేసుకున్న రోజున అశుభాలు మాట్లాడి తీవ్రమైన నెగటివిటీ ని మూటగట్టుకున్నాడు. నిన్నగాక మొన్న ఆయన ఒకరితో మాట్లాడిన ఆడియో టేప్ కూడా లీకై బాగా వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రభాస్(Rebel star Prabhas), సమంత(Samantha Ruth Prabhu) వీరిలో ఒకరు అఘాయిత్యం చేసుకుంటారని ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు.
Also Read : మళ్ళీ మొదలెట్టిన వేణు స్వామి..అల్లు అర్జున్, సుకుమార్ లపై సంచలన వ్యాఖ్యలు..సంచలనంగా మారిన లేటెస్ట్ వీడియో!
వేణు స్వామి సెలబ్రిటీలు అందరి గురించి ఇలాగే నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉండేవాడు. కేవలం అల్లు అర్జున్(Icon Star Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) విషయాల్లో మాత్రం పాజిటివ్ గా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ పతనం ప్రారంభం అయ్యింది.. రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీ ఆయన కారణంగా మరింత బుగ్గిపాలు కానుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ మీద శని ఉంది, ఆ ప్రభావం వల్లే ఆయన జైలుకు వెళ్ళాడు. దాంతో శని ప్రభావం కొంత తగ్గినప్పటికీ, ఇంకొంత ప్రభావం మాత్రం అలాగే ఉండిపోయింది. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మధ్య విభేదాలు ఏర్పడి వాళ్ళ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
వేణు స్వామి మాట్లాడిన ఈ మాటలకు అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నిసార్లు తిట్టించుకున్నా బుద్ధి రాలేదు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. వేణు స్వామి స్టార్ హీరోల అభిమానుల చేత దాడి చేయించుకునే వరకు తగ్గేలా లేడు, ఈయన ఈ జన్మలో మారడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వేణు స్వామి ఈ కామెంట్స్ చేశాడు. అయితే వేణు స్వామి మాట్లాడే మాటలను చూస్తుంటే ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి, దానికి అనుగుణంగా కామెంట్స్ చేస్తూంటాడే తప్ప ఆయనకు జాతక జ్ఞానం లేదని అంటున్నారు. పుష్ప ఘటన తర్వాత తెలంగాణ లో అదనపు షోస్, టికెట్ రేట్స్ కి ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. దానిని బేస్ చేసుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేసాడు, అది ఎవరైనా అంచనా వేయొచ్చు అంటూ వేణు స్వామి పై కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ఆ స్టార్ హీరోలిద్దరూ సినిమాలకు దూరం అవుతారట