Mad Square : టాలీవుడ్ లో కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త నటీనటులు ఇండస్ట్రీ కి పరిచయమై, తమ అద్భుతమైన ప్రతిభతో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని తెచ్చుకుంటున్నారు. కొంతమంది కమెడియన్స్ కూడా బాగా హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మ్యాడ్ చిత్రం లో నటించిన విష్ణు(Vishnu) గురించి. లడ్డు క్యారక్టర్ లో ఈ నటుడు ఆడియన్స్ ని ఎంతలా నవ్వించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన అమాయకత్వం తో సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు నవ్వులే నవ్వులు. కాలేజ్ డేస్ లో మన బ్యాచులలో కచ్చితంగా ఇలాంటోడు ఒకడు ఉండే ఉంటాడు అని అనిపించేంత గొప్పగా, సహజం గా నటించాడు. మ్యాడ్ చిత్రం లో నలుగురిలో ఒకరిగా మంచి గుర్తింపు వచ్చింది కానీ, మ్యాడ్ స్క్వేర్(Mad Square) చిత్రం మొత్తం ఇతని పైనే తీశారు.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ మొదటి వారం వసూళ్లు..టార్గెట్ ని అందుకోవడంలో విఫలం!
నిన్న జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), శంకర్ లేకపోతే అసలు ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రమే లేదంటూ కామెంట్స్ చేశాడు. కేవలం ఎన్టీఆర్ అభిప్రాయం మాత్రమే కాదు, ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరి అభిప్రాయం కూడా దాదాపుగా అదే. అయితే విష్ణు గురించి మీకెవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము. విష్ణు ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కాలేజ్ లోనే డిగ్రీ చదివాడు. విజయ్ దేవరకొండ డిగ్రీ లో నాల్గవ సంవత్సరం లో ఉంటే విష్ణు మొదటి సంవత్సరం లో ఉన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. కాలేజ్ డేస్ లో విష్ణు జీవితంలో ఏమి చేయాలి అనే విషయం పై ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడట.
కాలేజీ రోజుల్లో వాడు మంచి ఫోటోగ్రాఫర్ ని, ఆరోజుల్లోనే కామెడీ కూడా మా కాలేజ్ లో ఇరగొట్టేవాడని, అందువల్లే నాకు పరిచయమై స్నేహితుడు అయ్యాడంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ‘టాక్సీవాలా’ చిత్రం లో ఒక పాత్రకు కచ్చితంగా విష్ణు అయితే సూట్ అవుతాడని బలంగా నమ్మి అతన్ని ఈ సినిమాలో తీసుకున్నాం. చాలా అద్భుతంగా నటించాడు, భవిష్యత్తులో ఇతను పెద్ద రేంజ్ కి వెళ్లాడంటూ విజయ్ దేవరకొండ ఆ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే విష్ణు నేడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా మారిపోయాడు. ‘మ్యాడ్’ చిత్రం తో ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నాడు. ‘మ్యాడ్ స్క్వేర్’ కి అందుకుంటాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఈయన మ్యాడ్ సిరీస్ కాకుండా కీడా కోలా, హ్యాపీ ఎండింగ్, సరిపోదా శనివారం, డార్లింగ్, మా నాన్న సూపర్ హీరో, కోట బొమ్మాలి ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్..ఫ్యాన్స్ కి నో ఎంట్రీ!