IPL Retired Out players list : నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో ముంబై ఆటగాడు తిలక్ వర్మ (Tilak Verma) రిటైర్డ్ హర్ట్ గా అవుట్ కావడం సంచలనంగా మారింది. ఐపీఎల్ లో ఇలా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఈ లిస్టులో సంచలన ఆటగాళ్లు కూడా ఉన్నారు. లక్నో జట్టు తో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరుకున్నాడు.. తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరులు చేయడం వల్లే అతడిని ముంబై జట్టు యాజమాన్యం రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
ఫస్ట్ క్రికెటర్ అతడే
ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ హర్ట్ గా వచ్చిన తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. 2022 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున లక్నో జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో అతడు రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. అశ్విన్ బ్యాటింగ్ ఆర్డర్లో పైకి వచ్చి.. 19 ఓవర్ లో మొదటి రెండు బంతులు ఆడిన అతడు రియాన్ పరాగ్ కోసం తెలివిగా రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయాడు.
Also Read : IPL మ్యాచ్ కోసం హనీమూన్ క్యాన్సిల్.. నీది మామూలు త్యాగం కాదు మెండీసూ
పంజాబ్ కింగ్స్ 11 జట్టు తరఫున యువ ఆటగాడు అధర్వ టైడ్ కూడా రిటైర్డ్ హర్ట్ గా అవుట్ అయ్యాడు. 2023 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ జట్టు 124 పరుగుల లక్ష్యాన్ని చేదించాల్సి వచ్చింది. ఈ దశలో ఆధర్వ రన్స్ చేయడంలో తడబాటుకు గురయ్యాడు. అయితే పంజాబ్ చివరి 5 ఓవర్లలో 71 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో ఆధర్వ రిటైర్డ్ హర్ట్ గా వెను తిరిగి వెళ్ళిపోయాడు.
2023 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా రిటైర్డ్ హర్ట్ గా అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 140 స్ట్రైక్ రేట్ తో అతడు ఆడాడు. మరో ఎండ్ లో రషీద్ ఖాన్ కు అవకాశం కల్పించడానికి సాయి సుదర్శన్ రిటైర్డ్ హర్ట్ గా నిష్క్రమించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రషీద్ ఖాన్ ఒక బౌండరీ కొట్టాడు. ఆ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 23 పరుగులు చేసింది.
ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అయితే చివర్లో ముంబై జట్టు విజయం కోసం తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ గా పె విలియన్ చేరుకోవాల్సి వచ్చింది. అయితే ఈ దశలో శాంట్నర్ బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు రెండు బంతులు ఎదుర్కొని.. రెండు పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. చివరి ఓవర్ ను ఆవేష్ ఖాన్ అద్భుతంగా వేయడంతో ముంబై జట్టు కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో లక్నో జట్టు ముంబై జట్టుపై విజయం సాధించింది.
Also Read : అది ధోని క్రేజ్ అంటే.. కోహ్లీ, రోహిత్ కూడా సైడ్ అయిపోయారు!