https://oktelugu.com/

హీరో వెంకటేష్ ఆస్తుల విలువ రెట్టింపు?

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది సామెత. పైసలున్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనంటారు. సంపద సంపాదించుకోవడమే కాదు దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసుకోవాలి. అందుకే మన కథానాయకుడు వెంకటేష్ పొదుపు మంత్రాన్ని ఒంటపట్టించుకున్నాడు. ఫలితంగా వేల కోట్టు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అపర కోటీశ్వరుడిగా వెలుగొందుతున్నాడు. పుట్టుకతోనే కోటిశ్వరుడైన వెంకటేష్ ఆస్తుల విలువ తెలిస్తే నిర్ఘాంతపోవడం ఖాయం. ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. స్టార్ హీరోలకు సైతం గ్యారెంటీ లేదు. వరుసగా రెండు మూడు సినిమాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 13, 2021 / 01:51 PM IST
    Follow us on

    దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది సామెత. పైసలున్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనంటారు. సంపద సంపాదించుకోవడమే కాదు దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసుకోవాలి. అందుకే మన కథానాయకుడు వెంకటేష్ పొదుపు మంత్రాన్ని ఒంటపట్టించుకున్నాడు. ఫలితంగా వేల కోట్టు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అపర కోటీశ్వరుడిగా వెలుగొందుతున్నాడు. పుట్టుకతోనే కోటిశ్వరుడైన వెంకటేష్ ఆస్తుల విలువ తెలిస్తే నిర్ఘాంతపోవడం ఖాయం.

    ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. స్టార్ హీరోలకు సైతం గ్యారెంటీ లేదు. వరుసగా రెండు మూడు సినిమాలు హిట్టయితే రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. వచ్చిన దాంట్లో కొంత దాచుకుని వ్యాపారాలలో పెట్టుబడి పెడుతూ లాభాలు సాధిస్తుంటారు. అదే తరహాలో వెంకటేష్ కూడా తన ఆదాయాన్ని పెంచుకున్నారు.

    అప్పటి హీరోలు ఫిట్ నెస్ విషయంలో ఆసక్తి చూపే వారు కాదు. వెంకటేష్ మాత్రం బాడీ పెంచి కలెక్షన్లను కొల్గగొట్టారు. ప్రేమ కథా చిత్రాల నుంచి మాస్ చిత్రాల వరకు వైవిధ్యమైన పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించారు. తన నటనతో అందరిని తనవైపుకు తిప్పుకున్నారు. మెల్లగా తన పారితోషికాన్ని పెంచుకుంటూ సగం వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టేవారు. దీంతో లాభాల పంట పండి కోటీశ్వరుడిగా ఎదిగారు.

    ప్రస్తుతం వెంకటేష్ ఆస్తుల విలువ రూ.2 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం వెంకటేష్ ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టని హీరోగా ఆయనకు టాక్ ఉంది. ప్రస్తుతం ఆయన ఎఫ్3, నారప్ప, దృశ్యం2 సినిమాలతో బిజీగా ఉన్నారు.