
ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నా టీడీపీ, వైసీపీ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైర్ సాగుతూనే ఉంటుంది. తాజాగా రంగంలోకి చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ దిగారు. విద్యార్థుల పక్షాన తామున్నామంటూ లోకేశ్ ఆందోళన చేస్తున్నాడు. అంతేకాకుండా టీడీపీ విద్యార్థి విభాగం నాయకుడిగా బాధ్యతలు తీసుకొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. అయితే లోకేశ్ వ్యాఖ్యలపై జగన్ స్పందించకపోయినా వైసీపీ నాయకులు మాత్రం కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంపై టీడీపీ, వైసీపీ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తోందనుకోవవచ్చు.
టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం భావ్యం కాదని చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ మధ్య లోకేశ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని దానిపైనే ఫోకస్ పెట్టారు. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా..? అంటూ విమర్శించారు.
దేశంలో 15 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఇక్కడ నిర్వహించాల్సిన అవసరమం ఏముందంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం వెనకకు తగ్గకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని లోకేశ్ హెచ్చరించారు. విద్యార్థులు తలుచుకుంటే ఎంతటి ప్రభుత్వాలైనా పతనం తప్పదన్న చరిత్ర ఉందని లోకేశ్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. ఇప్పటికైనా స్టూడెంట్స్ అందరినీ ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే లోకేశ్ వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్య నేతలు కౌంటర్ ఇస్తున్నారు. విద్యార్థుల పరీక్షలకేమో గానీ లోకేశ్ ప్రశ్నలకే సమాధానం ఇవ్వాల్సి వస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు రమేశ్ రిప్లై ఇస్తున్నారు. పేద విద్యార్థులకు పెద్ద పెద్ద కళాశాలల్లో సీట్లు రావాలంటే మంచిగా చదువుకోవాలి కదా లోకేశం.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మిగతా రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేస్తే మన రాష్ట్రంలో చేయాల్సిన అవసరం లేదంటున్నారు. కొన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం.. కానీ ఆ ప్రభుత్వాలు చేయడం లేదు గదా.. అని వైసీపీ నేతలు సమాధానం ఇస్తున్నారు.