
మహారాష్ట్రలొ శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే అత్యుత్సాహం వివాదాస్పదంగా మారింది. ఓ కాంట్రాటక్టర్ పై ఆయన బహిరంగంగా శిక్ష విధించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబాయి సహా పలు ప్రాంతాల్లో వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్తుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన చాంద్ వాలి ఎమ్మెల్యే దిలీప్ లాండే రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిలో పారిశుధ్య కాంట్రాక్టర్ ను కూర్చోబెట్టారు. తన అనుచరులతో అతడిపై చెత్త వేయించారు. ఈ నిర్వాహకాన్ని సమర్ధించుకున్న ఎమ్మెల్యే. కాంట్రాక్టర్ సరిగా పని చేయలేదని మండిపడ్డారు.