https://oktelugu.com/

Tollywood: వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కొడుకుల్లో ఇండస్ట్రీ కి ఎవరి ఎంట్రీ ముందుగా ఉంటుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెపోటిజం అనేది ఎక్కువగా ఉంది. అయినప్పటికి ఇండస్ట్రీ లో టాలెంట్ ఉన్న చాలా మంది హీరోలు కూడా స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 05:25 PM IST

    Tollywood(3)

    Follow us on

    Tollywood: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఎక్కువైపోయింది అంటూ చాలామంది చాలా రకాల విమర్శలను చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే నెపోటిజం అనేది సినిమా ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ ఎవరికి వాళ్లు వాళ్ళ సొంత టాలెంట్ తో ఎదగాల్సిందే తప్ప వారసత్వం అనేది హీరోలకు ఎందుకు ఉపయోగపడదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోల్లో కొంతమంది మాత్రమే ఇక్కడ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటే, మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోయారు. అంటే వారసత్వం అనేది కేవలం వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం వాళ్ళ టాలెంట్ అని చెబుతున్నారు. మరి మొత్తానికైతే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే కావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది స్టార్ హీరోలు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా వెంకటేష్ కొడుకు అయిన అర్జున్, మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్, పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరా నందన్.. వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఇండస్ట్రీకి ముందుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.

    ముఖ్యంగా ముగ్గురు కూడా ఒకే ఏజ్ గ్రూపుకు చెందిన వాళ్ళు కావడం విశేషం. వీరిలో ఎవరు ఇండస్ట్రీకి ముందుగా వచ్చిన కూడా వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీని శాసిస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరా కెమెరా ముందుకు వచ్చి సందడి చేస్తూనే ఉంటాడు. ఇక మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కూడా ఎప్పుడో ఒకసారి కెమెరా ముందుకు వస్తుంటాడు. కానీ వెంకటేష్ కొడుకు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా కెమెరా ముందుకు వచ్చిన దాఖలాలు అయితే లేవు.

    ఇండస్ట్రీకి తీసుకువచ్చే సమయంలోనే అతన్ని స్క్రీన్ కి పరిచయం చేస్తాడా లేదంటే ఇంతకుముందే కొన్ని సినిమాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్ లలో నటింప చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కూడా ఈ ముగ్గురు సక్సెస్ లను అందుకొని తండ్రికి తగ్గ తనయులుగా ఎదుగుతారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూడాలి మరి వీళ్ళని వాళ్ళ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది…

    ఇక ప్రస్తుతం వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం గా అటు భాద్యతలను కొనసాగిస్తూనే, ఇటు సినిమాలను కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…