Priya Banerjee. : రానా నాయుడులో నటించిన ఈ భామ గుర్తుందా? ఇప్పుడెలా మారిందో తెలుసా?

ఈమధ్య సినిమాల్లో నటించే హీరోయిన్ల కంటే వెబ్ సిరీసుల్లో నటించే వారికి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. కొన్ని సినిమాలు థియేటర్లోకి రాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇందులో కంటెంట్ ఎక్కువగా ఉండడంతో వీటిని ఆదరిస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : September 4, 2024 5:15 pm

Priya Banerjee

Follow us on

Priya Banerjee. : తెలుగు సినిమా పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబం నుంచి రామానాయుడు నిర్మాతగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ద్వారా వెంకటేశ్, ఆ తరువాత రానా హీరోగా మంచిపేరు తెచ్చుకున్నారు. రానా హీరో అవుదామని ఎంట్రీ ఇచ్చినా సక్సస్ కాలేకపోయారు. ఆ తరువాత విలన్ పాత్రలు చేసి నటనా ప్రతిభ చూపించాడు. అయితే ఈమధ్య దగ్గుబాటి వెంకటేష్, రానాలు సినిమాలో జోరు తగ్గించారు. కానీ కొన్ని నెలల కిందట ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో కలిసి నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొద్దని స్వయానా వెంకటేష్ చెప్పారు. దీంతో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇందులో నటించిన వారితో పాటో ఓ నటికి మంచి పేరు వచ్చింది. ఈమె ఈ వెబ్ సిరీస్ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె గురించి చర్చకు వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

ఈమధ్య సినిమాల్లో నటించే హీరోయిన్ల కంటే వెబ్ సిరీసుల్లో నటించే వారికి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. కొన్ని సినిమాలు థియేటర్లోకి రాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇందులో కంటెంట్ ఎక్కువగా ఉండడంతో వీటిని ఆదరిస్తున్నారు. అయితే వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు మూవీ సినిమాపై విమర్శలు వచ్చాయి. కానీ ఇందులో నటించిన ఓ నటికి మంచి పేరు వచ్చింది. ఆమె ఎవరో కాదు ప్రియా బెనర్జీ.

ఈ సినిమాలో నటించేసరికి ప్రియా బెనర్జీకి నటన అప్పటికే తెలుసు. ఆమె అడవి శేషఉ తో కలిసి ‘కిస్’ అనే సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సందీప్ కుమార్ తో కలిసి జోరు అనే సినిమాలో మెరిసింది. నారా రోహిత్ తో కలిసి అసుర అనే సినిమాలో యాక్టింగ్ చేసింది. ఈ మూడు సినిమాల్లో కనిపించినా ప్రియా బెనర్జీని ఎవరూ పట్టించుకోలేదు. కానీ రానా నాయుడు సినిమాలో యాక్టింగ్ చేసిన ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో నారా రోహిత్ తో కలిసి కాస్త హాట్ గా కనిపించింది. ఆయనతో రొమాన్స్ చేసిన ప్రియా బెనర్జీ తన అందచందాలను ఆరబోసింది.

ఆ తరువాత సినిమాల్లో నటించడానికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వెళ్లిన ప్రియా బెనర్జీ పలు హిందీ సినిమాల కోసం ట్రై చేసింది. కానీ అక్కడా ఫలితం లేకపోవడంతో వెబ్ సీరీసుల్లో నట్టిస్తోంది. అయితే ప్రియా బెనర్జీ రానా నాయుడు సినిమా తరువాత గ్లామర్ షో చేయడం ఎక్కువ చేస్తున్నారు. దీంతో ఆమెకు ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియా బెనర్జీ లేటేస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడున్న ట్రెండీ హీరోయిన్లలోప్రియా బెనర్జీనే అని కొందరు పొగిడేస్తున్నారు.

అయితే సినిమాల్లో స్టార్ అవుదామని వచ్చిన ప్రియాబనర్జీకి ప్రతికూల వాతావరణమే ఉంటుంది. ఒక్క సినిమా సక్సెస్ అయితే తన కెరీర్ టర్న్ అవుతుందని భావిస్తోంది. మరి ఆ ఒక్క సినిమా ఏది కానుందో చూడాలి.