https://oktelugu.com/

Hyundai Aura CNG: సీఎన్ జీ వెర్షన్ లో హ్యుందాయ్ కొత్త కారు.. దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

హ్యుందాయ్ ఆరా సీఎన్ జీ వెర్షన్ ఇన్నర్ లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే తో కూడిన 8.89 సెంటీ మీటర్ల స్పీడో మీటర్ ఉన్నాయి. ఇది సెడాన్ జడ్ ఆకారపు ఎల్ ఈడీ టెయిల్ లైట్స్ ను కలిగి ఉంది. ఇందులో ఫ్రంట్ విండోస్, డ్రైవర్ సీటు కన్వినెంట్ గా ఉంటుంది. హ్యుందాయ్ ఆరా సీఎన్జీ బెస్ట్ సేప్టీ ఫీచర్లను కలిి ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 4, 2024 / 05:28 PM IST

    Hyundai Aura CNG

    Follow us on

    Hyundai Aura  CNG: : దేశంలోని ఆటోమోబైల్ కంపెనీ హ్యుందాయ్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని మోడళ్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయినా ఈ కంపెనీ ఎప్పటి కప్పుడు కొత్త టెక్నాలజీతో కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లో బడ్జెట్ లో పలు మోడళ్లను పరిచయం చేస్తుంది. లేటేస్టుగా ఈ కంపెనీ కొత్త కారును విడుదల చేసింది. ఇది ఇప్పటికే ఉన్న కార్ల కంటే అడ్వాన్స్డ్ ఫీచర్లతో పాటు తక్కువ ధరలో లభించే అవకాశం ఉంది. ఇంతకీ హ్యుందాయ్ రిలీజ్ చేసే ఆ కొత్త కారు ఏది?దాని స్పెషిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? ఆ వివరాల్లోకి వెళితే..

    దక్షిణ కొరియా కంపెనీకి చెందిన హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో దూసుకుపోతుంది. ఇప్పుడున్న కార్ల కంపెనీలతో పోటీ పడి టాప్ 10 లిస్టులోకి చేరింది. ఎప్పటికప్పుడు కొత్త కార్లను పరిచయం చేస్తున్న హ్యుందాయ్ తాజాగా ఆరా సీఎన్జీ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఆరా మోడల్ 2 లక్షల యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. ఇప్పుడు కొత్తగా సీఎన్ జీ వెర్షన్ లో అందుబాటులోకి రావడంతో ఆసక్తిగా మారింది.

    హ్యుందాయ్ ఆరా సీఎన్ జీ వెర్షన్ ఇన్నర్ లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే తో కూడిన 8.89 సెంటీ మీటర్ల స్పీడో మీటర్ ఉన్నాయి. ఇది సెడాన్ జడ్ ఆకారపు ఎల్ ఈడీ టెయిల్ లైట్స్ ను కలిగి ఉంది. ఇందులో ఫ్రంట్ విండోస్, డ్రైవర్ సీటు కన్వినెంట్ గా ఉంటుంది. హ్యుందాయ్ ఆరా సీఎన్జీ బెస్ట్ సేప్టీ ఫీచర్లను కలిి ఉంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, 3పాయింట్ సీట్ బెల్ట్ లు ఉన్నాయి. ఇవి రిమైండర్ గా పనిచేస్తాయి. ఈబీడీ తో కూడిన ఏబీఎస్ ఇమ్మొబిలైజర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ తో పనిచేస్తాయి.

    ఈ కొత్త మోడల్ లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. దీనితో పాటు సీఎన్ జీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 68 బీహెచ్ పీ పవర్ తో పాటు 95.2 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తున్న ఇది వినియోగదారులకు అనుగుణంగా మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ. 7.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయించాలని ప్లాన్ చేస్తున్నారు. సెడాన్ లుక్ తో ఉన్నప్పటికీ స్పేషియస్ ఎక్కువగా కోరుకునే వారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇది కేవలం బేస్ ఈ వేరియంట్ లో మాత్రమే విక్రయించబడుతుంది.

    ఇప్పటి వరకు హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన గ్రాండ్ ఐ 10 నియోస్ లు డ్యూయెల్ సిలిండర్ ను కలిగి ఉన్నాయి. అయితే కొత్తగా రిలీజ్ అయినా ఆరా సీఎన్ జీలో ఆ అవకాశం లేదు. కానీ ఆరా కు ఉన్న ఆదరణ కారణంగా సీఎన్ జీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. అయితే కొత్త కారు అమ్మకాలు ఏ విధంగా ఉంటుందో చూడాలి.