https://oktelugu.com/

Varun Tej- Lavanya Tripathi Marriage: వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్దానికి ముహూర్తం ఫిక్స్..సంబరాల్లో మెగా ఫ్యాన్స్

నాగబాబు కూడా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు అని విన్నాము నిజమేనా అని అడిగిన ప్రశ్నకి నాగ బాబు 'నో' అని సమాధానం చెప్పలేకపోయాడు.'సమయం వచ్చినప్పుడు వరుణ్ బాబు స్వయంగా ప్రకటిస్తాడు' అని చెప్పాడు.ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది, జూన్ నెలలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 17, 2023 / 07:50 AM IST

    Varun Tej- Lavanya Tripathi Marriage

    Follow us on

    Varun Tej- Lavanya Tripathi Marriage: గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్న గాసిప్స్ లో ఒకటి వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం. వీళ్లిద్దరు గత కొంత కాలం గా ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ కూడా చేసుకున్నారని, వీళ్లిద్దరి పెళ్ళికి ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారని, త్వరలోనే పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

    అయితే ఈ వార్తలపై అటు వరుణ్ తేజ్, ఇటు లావణ్య త్రిపాఠి మా మధ్య అలాంటిది ఏమి లేదంటూ కొట్టిపారేశారు. అయితే రీసెంట్ గా నిహారిక కొణిదెల ఇచ్చిన ఇంటర్వ్యూ లో ‘మా అన్నయ్య తో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి అంటే నాకు ఎంతో ఇష్టం,మా కుటుంబం లో జరిగే ప్రతీ ఫంక్షన్ కి ఆమె కచ్చితంగా ఉండాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చింది.

    మరో పక్క నాగబాబు కూడా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు అని విన్నాము నిజమేనా అని అడిగిన ప్రశ్నకి నాగ బాబు ‘నో’ అని సమాధానం చెప్పలేకపోయాడు.’సమయం వచ్చినప్పుడు వరుణ్ బాబు స్వయంగా ప్రకటిస్తాడు’ అని చెప్పాడు.ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది, జూన్ నెలలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

    దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలలోనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచెయ్యబోతున్నాడట.ఈ వార్త కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వరుజ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో ‘గాండీవ దారి అర్జున’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. మరో పక్క లావణ్య త్రిపాఠి కూడా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా గడుపుతుంది.