https://oktelugu.com/

Bichagadu 2 First Review: విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’ మొట్టమొదటి రివ్యూ..సైన్స్ ఎమోషన్స్ తో అల్లాడించేసాడుగా!

అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం సృష్టించిన చిత్రాలలో ఒకటి 'బిచ్చగాడు'. విజయ్ ఆంటోనీ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు మరియు తమిళం బాషలలో భారీ హిట్ అయ్యింది.

Written By: , Updated On : May 17, 2023 / 07:46 AM IST
Bichagadu 2 First Review

Bichagadu 2 First Review

Follow us on

Bichagadu 2 First Review: కంటెంట్ బాగుంటే ముక్కు మొహం తెలియని హీరోల సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్ గా ‘కాంతారా’ చిత్రాన్ని తీసుకోవచ్చు. కన్నడ లో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా తెలుగు లో కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది. అయితే అంతకు ముందు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలలో తమిళ సినిమాలు ఇక్కడ బాగా ఆడేవి.

అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం సృష్టించిన చిత్రాలలో ఒకటి ‘బిచ్చగాడు’. విజయ్ ఆంటోనీ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు మరియు తమిళం బాషలలో భారీ హిట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం ఈ చిత్రం ఆ రోజుల్లోనే 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా ‘బిచ్చగాడు 2 ‘ చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
Recommended Video:
బిచ్చగాడు 2 మూవీ రివ్యూ || Bichagadu 2 Review || Public Talk || Oktelugu Entertainment

ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో వేశారు, కొంతమంది మీడియా మిత్రులతో పాటుగా, విజయ్ ఆంటోనీ కి టాలీవుడ్ ఎంతో దగ్గరైన కొంత మంది సినీ ప్రముఖులు కూడా ఈ షో కి హాజరయ్యారు. ఈ షో చూసిన తర్వాత మీడియా మిత్రుల నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బిచ్చగాడు సినిమా కంటే ఈ చిత్రమే ఎంతో బాగుందని, విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడని చెప్తున్నారు.

బ్రెయిన్ మార్పిడి పై జరిపే ప్రయోగం కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే కథ. డబ్బు మరియు ఎమోషన్స్ చుట్టూ సాగే ఈ కథలో ప్రతీ ఒక్కరు జీవించేశారని చెప్తున్నారు.విడుదలకు ముందే ఈ రేంజ్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత కూడా అదే రేంజ్ టాక్ ని తెచుకుంటుందో లేదో చూడాలి.