Mahesh Babu – Trivikram: 90 రోజుల్లో పూర్తి చెయ్యకపోతే సినిమాని ఆపేద్దాం అంటూ త్రివిక్రమ్ కి మహేష్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్

మహేష్ బాబు త్రివిక్రమ్ కి షరతులు మీద షరతులు పెడుతున్నాడట. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో 90 రోజుల నాన్ స్టాప్ లాంగ్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని, లేకపోతే సినిమాని ఇక్కడితోనే ఆపేద్దాం అని చెప్పాడట.

Written By: Vicky, Updated On : May 17, 2023 7:55 am

Mahesh Babu - Trivikram

Follow us on

Mahesh Babu – Trivikram: మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ గత కొంత కాలం క్రితం ప్రారంభం అయ్యింది కానీ మధ్యలో చాలా బ్రేకులు పడుతున్నాయి.అందుకు కారణం త్రివిక్రమ్ తన టేకింగ్ తో మహేష్ బాబు ని సంతృప్తి పర్చకపోవడం వల్లే అని అంటున్నారు.

మరోపక్క మహేష్ బాబు త్రివిక్రమ్ కి షరతులు మీద షరతులు పెడుతున్నాడట. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో 90 రోజుల నాన్ స్టాప్ లాంగ్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని, లేకపోతే సినిమాని ఇక్కడితోనే ఆపేద్దాం అని చెప్పాడట.దీనితో త్రివిక్రమ్ లాంగ్ షెడ్యూల్ అంటే ఆర్టిస్టుల డేట్స్ అన్ని చూసుకోవాలి. అన్ని సెట్ అయ్యాక షూటింగ్ ప్రారంభిద్దాం అని చెప్పాడట.జూన్ నెలలో త్రివిక్రమ్ కోరుకున్న ఆర్టిస్టుల డేట్స్ అన్నీ 90 రోజులకు సరిపడా దొరకబోతున్నాయి. ఈ లాంగ్ షెడ్యూల్ లోనే షూటింగ్ పూర్తి చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు త్రివిక్రమ్.

ఇక ఈ చిత్రం లో హీరోయిన్స్ గా శ్రీలీల మరియు పూజ హెగ్డే నటిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. అందులో ఒక పాత్ర నెగటివ్ షేడ్ లో ఉండబోతుందని సమాచారం. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నెల 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం. దీనికి ఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. మహేష్ సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎలా కలిసి వస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.