
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ప్రపంచంతో సంబంధం లేదు. ఒకపక్క కరోనా భయంతో ప్రపంచం అల్లాడిపోతోంది, మరోపక్క సినీ లోకం కూడా కష్టకాలంలో పని లేక నలిగిపోతోంది, అన్నిటికి కరోనాతో జనం చనిపోతున్నా వర్మ మాత్రం తన పైత్యాన్ని ఇంకా అలాగే కొనసాగిస్తున్నాడు. ఏది ఏమైనా ఆర్జీవీ అంటేనే వైవిధ్యం. ఆర్జీవీ అంటేనే వివాదాస్పదంతో కూడుకున్న బూతు మయం.
మొన్నటి వరకు వర్మ బోల్డ్ కామెంట్స్ తో మైండ్ బ్లాక్ చేశాడు. మరి ఆ కాంట్రవర్సీ కామెంట్స్ రొటీన్ అయిపోయాయి అనుకున్నాడో లేక, తనకు మాట్లాడి మాట్లాడి బోర్ కొట్టిందో తెలియదు గాని, హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. రీసెంట్ గా వర్మ, హీరోయిన్ సోనియా తొడ పై ముద్దు పెడుతున్న ఫోటోను వదిలాడు.
ఆ ఫోటో బాగా వైరల్ అయింది. ఓ అమ్మాయి పాదాన్ని ముద్దాడుతూ వర్మ ఫోటో దిగాడు. పైగా అర్ధరాత్రి ఒంటిగంటకు తన పైత్యపు స్టిల్ ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతూనే ఉంది. మొత్తానికి వర్మ కామెంట్స్ ను వదిలేసి, ఫోటోల పై పడ్డాడు. మరి రానున్న రోజుల్లో ఈ దర్శకుడు ఇంకా ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో చూడాలి.
గత కొన్ని సంవత్సరాలుగా ఆడియన్స్ బలహీనతలనే క్యాష్ చేసుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్జీవీ, మొత్తానికి బూతు సినిమాలతోనే దర్శకుడిగా నెట్టుకొస్తోన్నాడు. ఏది ఏమైనా తన సినిమాల పరంపరను మాత్రం ఆర్జీవీ అపట్లేదు. ఖాళీగా వున్న ఔత్సాహిక టెక్నీషియన్ల శ్రమను పెట్టుబడిగా పెట్టి, వాళ్ళు చేసే సినిమాలకు తన పేరు వేసుకుంటూ ముందుకు పోతున్నాడు వర్మ.