
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన చేసిన తర్వాత ఆయన తొలిసారి ఇక్కడికి వచ్చారు. శుంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ఆయన అభిమానులు, కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కమలాపూర్, శుంభుని పల్లి, కానిపర్తిలో రోడ్ షో లో వెళుతుండగా అక్కడికి ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. గ్రామాల్లో మహిళలు హారతులు పడుతున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.