వివేకా కేసులో నిందితులపై బిగిస్తున్న ఉచ్చు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. గతంలో పలుమార్లు దర్యాప్తు జరిపినప్పటికి కీలక ఆధారాలు సంపాదించడంలో విఫలమైన సీబీఐ ఈసారి పకడ్బందీగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వివేకా కారు డ్రైవర్ సహా పలువురిని తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ఆలస్యం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసారి […]

Written By: Srinivas, Updated On : June 8, 2021 12:38 pm
Follow us on

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. గతంలో పలుమార్లు దర్యాప్తు జరిపినప్పటికి కీలక ఆధారాలు సంపాదించడంలో విఫలమైన సీబీఐ ఈసారి పకడ్బందీగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వివేకా కారు డ్రైవర్ సహా పలువురిని తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఉచ్చు బిగిస్తోంది.

ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ఆలస్యం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసారి సీబీఐ అధికారులు చురుగ్గా ముందుకు వెళుతున్నారు. వరుసగా రెండో రోజు ఆధారాల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో జైలుకు వచ్చినవారు విడుదలైన వారితో పాటు ఇతర ఆధారాలను వారు సేకరిస్తున్నారు.

వివేకా హత్య జరిగినప్పుడు నిందితులు ఎక్కడున్నారు. ఆతర్వాత ఎక్కడికి వెళ్లిపోయార్న దానిపై అధికారులనుంచి వివరాలు తీసుకుంటున్నారు. గతంలో పులివెందుల కేంద్రంగా విచారణ సాగించిన సీబీఐ అధికారులు ఈసారి కడప సెంట్రల్ జైలుపై దృష్టి పెట్టడంతో పక్కా ప్లాన్ తోనే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

వివేకా హత్య జరిగిన తీు చూస్తే కరడుగట్టిన నేరస్తులు, గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారు. అలాగే స్థానికులే హంతకులన్న అంచనాకు సీబీఐ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కడప సెంట్రల్ జైలు కేంద్రంగానే తమకు ఆధారాలు లభించే అవకాశముందని సీబీఐ అంచనా వేస్తోంది. అలాగే పులివెందులకు చెందిన పలువురిని కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కడప సెంట్రల్ జైలు వద్ద లభించిన ఆధారాలతో వీరిని ప్రశ్నించే అవకాశముంది.