Homeఅంతర్జాతీయంIran military capability analysis: ఇరాన్‌ అసమాన యుద్ధ సామర్థ్యం.. ఐదు ఆయుధాలతో అమెరికాకు చుక్కలు!

Iran military capability analysis: ఇరాన్‌ అసమాన యుద్ధ సామర్థ్యం.. ఐదు ఆయుధాలతో అమెరికాకు చుక్కలు!

Iran military capability analysis: పశ్చిమాసియాలో అకారనంగా యుద్ధం మొదలు పెట్టిన అమెరికా–ఇజ్రాయెల్‌.. ఇప్పుడు యుద్ధం నుంచి ఎలా వైదొలగాలో తెలియక తల పట్టుకుంటున్నాయి. 50 రోజులు దాటినా యుద్ధం ముగియలేదు. తాత్కాలిక సీజ్‌ఫైర్‌తో రెండు వారాలుగా దాడులు ఆగాయి. అయితే నెల రోజులకుపైగా అగ్రరాజ్యం అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇరాన్‌.. అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలపై, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌ అధిక ఆయుధ శక్తి ఉన్నప్పటికీ, తొలి రోజు నాయకుడిని కోల్పోయి, […]

Iran military capability analysis: పశ్చిమాసియాలో అకారనంగా యుద్ధం మొదలు పెట్టిన అమెరికా–ఇజ్రాయెల్‌.. ఇప్పుడు యుద్ధం నుంచి ఎలా వైదొలగాలో తెలియక తల పట్టుకుంటున్నాయి. 50 రోజులు దాటినా యుద్ధం ముగియలేదు. తాత్కాలిక సీజ్‌ఫైర్‌తో రెండు వారాలుగా దాడులు ఆగాయి. అయితే నెల రోజులకుపైగా అగ్రరాజ్యం అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇరాన్‌.. అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలపై, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌ అధిక ఆయుధ శక్తి ఉన్నప్పటికీ, తొలి రోజు నాయకుడిని కోల్పోయి, జెట్లు–డ్రోన్లు నాశనమైనా రెండు నెలలుగా పోరాడుతున్న ఇరాన్‌. హార్మూజ్‌ నిర్బంధంతో ప్రపంచ శక్తులను ఐదు రకాల ఆయుధాలతో ఇరాకాటంలో పెట్టింది.

బాలిస్టిక్‌ క్షిపణులు..
ఫతహ్‌ (200–500 కి.మీ), ఝుల్ఫిగర్‌ (700+ కి.మీ), షాహబ్‌ సిరీస్‌ (1,000–2,000 కి.మీ) క్షిపణులు గల్ఫ్‌ దేశాలు, అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. అధిక పేలోడ్, రోడ్డు లాంచర్లు, ఘన ఇంధనంతో మొబైల్‌. డెకాయ్‌ వేరియంట్లు రడార్లను మోసం చేస్తాయి.

డ్రోన్లు..
షాహీద్, మొహాజెర్, అబాబిల్‌ వంటి ఆత్మాహుతి, నిఘా, స్వల్ప రేంజ్‌ యూఏవీలు వైమానిక స్థావరాలు, నౌకలపై నిరంతర ఒత్తిడి. చౌక ధరతో పెద్ద సంఖ్యలో వాడి గగనతల రక్షణను సంక్షోభించి, అమెరికాకు ఖరీదైన అంటీ–డ్రోన్‌ వ్యవస్థలు వాడేలా చేస్తున్నాయి.

నౌకా విధ్వంసక క్రూజ్‌ క్షిపణులు
ఇరాన్‌ తీర్చిదిద్దిన క్రూజ్‌ క్షిపణులు సౌదీ, యూఏఈ, ఒమాన్, ఇరాక్‌ లక్ష్యాలు చేరుకుంటాయి. తక్కువ ఎత్తు వేగంతో రడార్‌ మోసం చేస్తూ, అమెరికా యుద్ధనౌకలు, ఓడరేవులపై దాడి. ఇవి సముద్ర మార్గాలను ప్రమాదకరంగా మార్చాయి.

స్వార్మ్‌ బోట్లు..
పర్షియన్‌ గల్ఫ్, ఒమాన్‌ గల్ఫ్‌లో సీ మైన్స్‌ నౌకల రాకపోకలను అడ్డుకుంటాయి. రాకెట్లు, మెషీన్‌ గన్స్‌తో కూడిన చిన్న ఫాస్ట్‌ బోట్ల స్వార్మ్‌లు గుంపుగా దాడి చేసి, భారీ నౌకలను ముప్పు పెడతాయి. ఇది అమెరికా సముద్రయానానికి పెద్ద సవాల్‌.

గగనతల రక్షణ నెట్‌వర్క్‌..
బావర్‌–373, ఖోర్దాద్, ఎస్‌–300 వంటి వ్యవస్థలు యుద్ధవిమానాలు, క్షిపణులను అడ్డుకుంటాయి. దేశీయ అభివృద్ధి, రష్యన్‌ టెక్నాలజీ మిక్స్‌తో అమెరికా జెట్లు దూరంగా ఉండి దీర్ఘదూర క్షిపణులే వాడుతున్నాయి.

అధిక శక్తి లేకపోయినా, మొబైల్, చౌక ఆయుధాలతో ఖర్చు పెంచి, హార్మూజ్‌ వంటి కీలక ప్రాంతాలను లాక్‌ చేసి ఇరాన్‌ పోరాడుతోంది. ఇది అసిమెట్రిక్‌ వార్‌ఫేర్‌కు ఉదాహరణ. పెద్ద శక్తులను ఆర్థికంగా, లాజిస్టిక్‌గా బలహీనపరుస్తోంది. రెండు నెలల పోరు ఇరాన్‌ స్థిరత్వాన్ని చూపిస్తోంది, కానీ దీర్ఘకాలిక స్థిరత్వం సవాలే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper