Homeఎంటర్టైన్మెంట్Chandrababu Naidu biopic: సీఎం చంద్రబాబు బయోపిక్ లో హీరోగా నటించనున్న యంగ్ హీరో.. పూర్తి...

Chandrababu Naidu biopic: సీఎం చంద్రబాబు బయోపిక్ లో హీరోగా నటించనున్న యంగ్ హీరో.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Chandrababu Naidu biopic: ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుల్లో ఒకరు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu). 80 ఏళ్ళ వయస్సుకి దగ్గరగా ఉన్న చంద్రబాబు కు, 5 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఉంది. నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా నిల్చిన ఆయన, ప్రస్తుతం ఎంతటి గొప్ప పాలనను అందిస్తున్నాడో మనమంతా చూస్తున్నాం. పోలవరం , అమరావతి రాజధాని ని ఎట్టి పరిస్థితిలోనూ రాబోయే రెండు ఏళ్లలో పూర్తి చేసి , […]

Chandrababu Naidu biopic: ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుల్లో ఒకరు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu). 80 ఏళ్ళ వయస్సుకి దగ్గరగా ఉన్న చంద్రబాబు కు, 5 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఉంది. నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా నిల్చిన ఆయన, ప్రస్తుతం ఎంతటి గొప్ప పాలనను అందిస్తున్నాడో మనమంతా చూస్తున్నాం. పోలవరం , అమరావతి రాజధాని ని ఎట్టి పరిస్థితిలోనూ రాబోయే రెండు ఏళ్లలో పూర్తి చేసి , జాతికి అంకితం చేసే దిశగా ఆయన కృషి చేస్తున్నాడు. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లేని అరుదైన ఘనత చంద్రబాబు సొంతం. ఎందుకంటే ఆయన ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి పని చేశాడు . ఆయనకు ఊరికే ఈ స్థానం రాలేదు, ఆయన జీవితం లో ఎన్నో అవమానాలను , దారుణాలను ఎదురుకోవాల్సి వచ్చింది.

ఆయన రాజకీయ జీవితం లో కేవలం గెలుపులు మాత్రమే కాదు , ఓటములు కూడా చాలానే ఉన్నాయి. ఘోరపరాజయాలు కూడా ఉన్నాయి. ఆయనకు ఎదురైనటువంటి పరాజయాలు వేరే ఏ రాజకీయ నాయకుడు ఎదురుకొని ఉన్నా రాజకీయ సన్యాసం తీసుకునేవారు. కానీ చంద్రబాబు బలంగా నిలబడి ఎప్పుడూ చూడనంత మెజారిటీ తో 2024 ఎన్నికల్లో సంచలనం సృష్టించాడు. అలాంటి అద్భుతమైన చరిత్ర పై సినిమా తీయబోతున్నారు త్వరలోనే . ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు భాను శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో కాదు, పాడ్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తాడట. త్వరలోనే పూర్తి వివరాలను చేస్తానని రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు భాను శంకర్. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర కోసం ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన లో ఉన్నాడట భాను శంకర్.

గతంలో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రంలో యంగ్ చంద్రబాబు గా రానా దగ్గుబాటి అద్భుతంగా నటించాడు. అదే విధంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్ష్మి’స్ ఎన్టీఆర్’ చిత్రం లో అచ్చు గుద్దినట్టు చంద్రబాబు పోలికలతో ఉన్న ఒక వ్యక్తిని వెండితెర మీదకు తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. మళ్లీ వాళ్ళిద్దరిలోనే ఎవరినో ఒకరిని తీసుకొని ఉండుంటే బాగుండేది కదా, ఎందుకు ఇప్పుడు విశ్వక్ సేన్ ని తీసుకోవడం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది కామెంట్స్ చేసున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. చంద్రబాబు నాయుడు బాల్యం , ఆయన చదువుకునే రోజుల దగ్గర నుండి , 2024 లో సీఎం అయ్యే వరకు ఈ సినిమా ఉంటుందట. చూడాలి మరి భాను శంకర్ ఈ బయోపిక్ ని ఎలా మలచబోతున్నాడు అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper