Varanasi Vikram Yama Role: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి కోవా కు చెందిన వారిలో రాజమౌళి ఒకరు…ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…పాన్ వరల్డ్ లో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకొని ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే పాన్ వరల్డ్ దర్శకులందరికి పోటీని ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు…ఇక వారణాసి సినిమాలో మహేష్ బాబు ఐదు డిఫరెంట్ పాత్రలను పోషిస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో శివుడి పాత్ర కోసం ఒక హీరోని ఎంపిక చేసుకోగా, యముడి పాత్ర కూడా ఇందులో కీలకమైన పాత్ర వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విక్రమ్ ఈ సినిమాలో యముడి పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. తన పాత్ర నిడివి చాలా తక్కువ సమయం ఉంటుందట.
అయినప్పటికి ఆ పాత్రలోకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే విక్రమ్ ఈ పాత్రనైతే ఎంపిక చేసుకున్నాడట. ఇక తొందర్లోనే తను ‘వారణాసి’ సినిమా షూటింగ్ లో అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఒక వారం రోజులపాటు ఈ సినిమా కోసం తన డేట్స్ ను కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.
వారం రోజుల్లోనే ఆయనకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి తనను ఈ సినిమా నుంచి వదిలేస్తాడట. మరి దానికోసం తన మేకోవర్ ను కూడా మార్చబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా విక్రమ్ ఈ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాను చూస్తే తప్ప సరైన క్లారిటి అయితే రాదు…