Homeఎంటర్టైన్మెంట్Rajamouli: రాజమౌళి సినిమాలో ఆ రెండు కీలక పాత్ర వహిస్తాయి...

Rajamouli: రాజమౌళి సినిమాలో ఆ రెండు కీలక పాత్ర వహిస్తాయి…

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాలలో 12 సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయంటే అది మామూలు విషయం కాదు. ఇక ఇలాంటి క్రమంలో రాజమౌళి చేస్తున్న సినిమాల విషయంలో తను చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఆయన సినిమాల్లో ప్రధానంగా రెండు అంశాలు […]

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాలలో 12 సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయంటే అది మామూలు విషయం కాదు. ఇక ఇలాంటి క్రమంలో రాజమౌళి చేస్తున్న సినిమాల విషయంలో తను చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఆయన సినిమాల్లో ప్రధానంగా రెండు అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ప్రతి సీన్ ని చాలా హై వోల్టేజ్ తో తెరకెక్కిస్తుంటాడు. అలాగే ఎమోషన్ సన్నివేశాలను సైతం తారా స్తాయికి తీసుకెళ్లి ప్రేక్షకులు దానిని ఫీలయ్యే విధంగా సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉంటాడు. యాక్షన్ బ్లాక్స్ ను సైతం అదే రేంజ్ లో చిత్రీకరిస్తుంటాడు. ప్రేక్షకుడిలో ఒక ఉత్తేజాన్ని కలిగించే విధంగా డిజైన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతని సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ పెరుగుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఘనత కూడా తనకే దక్కింది. ప్రస్తుతం వారణాసి సినిమాతో మరోసారి డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… రాజమౌళి సక్సెస్ ఫార్ములని కనిపెట్టి దాన్ని పాటిస్తే మరి కొంతమంది దర్శకులు సైతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారచ్చనే ఉద్దేశ్యంతో కొంతమంది సినిమా మేధావులు సైతం సలహాలైతే ఇస్తున్నారు.

కానీ రాజమౌళి పాటించే స్ట్రాటజీ ఇతర దర్శకులు పాటించాలంటే చాలా కష్టంతో కూడుకున్నదిగా అవుతుంది. ఎందుకంటే రాజమౌళి ఎప్పుడు సినిమా మీదనే ఫోకస్డ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సినిమాని డెలివరీ చేసే ప్రయత్నం చేస్తుంటాడు.

మరి అంత ఓపిక ఉన్న దర్శకులు ఈ కాలంలో ఎవరున్నారు కాబట్టి రాజమౌళి లాంటి సక్సెస్ లను సాధించాలంటే ముందుగా ఓపిక అనేది ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ దర్శకులు సినిమాని పర్ఫెక్ట్ గా డీల్ చేయగలుగుతారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper