Homeవింతలు-విశేషాలుOld Tractor Sold For Crores: పాత ట్రాక్టర్ ను ఫొటో తీసి.. సోషల్ మీడియాలో...

Old Tractor Sold For Crores: పాత ట్రాక్టర్ ను ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పెట్టాడు.. ఆ తర్వాత ఇతడి జీవితం ఎలా మారిపోయిందంటే..

Old Tractor Sold For Crores: నేటి సాంకేతికకాలంలో పాత వస్తువులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. పాత వస్తువును సొంతం చేసుకోవడానికి కొంత మంది ఏకంగాకోట్లను ఖర్చు చేస్తున్నారు. అవసరమైతే పాత వస్తువుల కోసం ప్రపంచం మొత్తంగా గాలిస్తున్నారు. కొన్నిసార్లు మనం చేసే పనులు ఊహించని మలుపులకు కారణమవుతాయి. మన జీవితాన్ని మరో వైపునకు తీసుకెళ్తాయి. అటువంటి ఘటనే ఇది కూడా.. ఈకథనంలో వ్యక్తి చేసిన పని అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతడిని రాత్రికి రాత్రే […]

Old Tractor Sold For Crores: నేటి సాంకేతికకాలంలో పాత వస్తువులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. పాత వస్తువును సొంతం చేసుకోవడానికి కొంత మంది ఏకంగాకోట్లను ఖర్చు చేస్తున్నారు. అవసరమైతే పాత వస్తువుల కోసం ప్రపంచం మొత్తంగా గాలిస్తున్నారు.

కొన్నిసార్లు మనం చేసే పనులు ఊహించని మలుపులకు కారణమవుతాయి. మన జీవితాన్ని మరో వైపునకు తీసుకెళ్తాయి. అటువంటి ఘటనే ఇది కూడా.. ఈకథనంలో వ్యక్తి చేసిన పని అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.

మన నిత్యజీవితంలో ఎన్నో వస్తువులను కొనుగోలు చేస్తాం. అవసరాలు తీరగానే పక్కన పడేస్తాం. కొందరమే వాటిని పాత ఇనుపషాపులో అమ్మేస్తారు. కొందరైతే వాటిని జాగ్రత్తగా దాచుకుంటారు. అలా జాగ్రత్తగా దాచుకుున్న వస్తువులు కొన్ని సందర్భాలలో ఊహించని ప్రతిఫలాలు ఇస్తాయి. అటువంటి దే ఈ సంఘటన కూడా.

ఓ భారతీయుడు గతంలో ఓ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. దానిని చాలా రోజుల పాటు వినియోగించాడు. అనంతరం దానిని పక్కనపెట్టాడు. ఇటీవల తన పాత ట్రాక్టర్ ను ఫొటో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్త విపరీతమైన చర్చకు దారి తీసింది. ఆ ఫొటో సర్కులేట్ కావడంతో ఓ విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడి కంట్లో పడింది.

ఆ ట్రాక్టర్ అతడిని విపరీతంగా ఆకర్షించింది. మరో మాటకు తావులేకుండా అతడు దానిని కొనుగోలు చేశాడు. దాని కోసం ఏకంగా 1.25 కోట్లు ఖర్చు చేశాడు. దీంతో ఆ ట్రాక్టర్ యజమాని ఆనందానికి అవధులు లేవు. తన పాత ట్రాక్టర్ ఈ స్థాయిలో లాభాలు తెస్తుందని అతడు కలలో కూడా ఊహించలేదని చెబుతున్నాడు.

‘నాకు ఆనందంగా ఉంది. పాత ట్రాక్టర్ ఇంతటి లాభాలు తెస్తుందని ఊహించలేదు. నేనే అప్పట్లో దీనిని కొనుగోలు చేశాను. నా అవసరాలు తీరిన తర్వాత దీనిని అమ్మాలని అనుకోలేదు. అలానే పక్కన పెట్టాను. అదికాస్త ఈరోజున ఏకంగా నాకు 1.25 కోట్లను తీసుకొచ్చిందని’ ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.

అరుదైన పాత వస్తువులను ప్రపంచం ముందుకు తీసుకురావడానికి చాలా వరకు సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఓఎల్ఎక్స్ లాంటి వాటిల్లో అయితే పాత వస్తువులనే కాదు, కొత్తవస్తువులను కూడా అమ్మే వెసలుబాటు కూడా ఉంది. ఒకప్పుడు కొత్త ఒక చింత అనే వారు. పాత ఒకరోత అని తిట్టుకునే వారు. కానీ ఇప్పుడు పాత అనేది ఒక వింతగా మారిపోయింది. కొత్త అనేది చింత లాగా రూపాంతరం చెందింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper