Homeఎంటర్టైన్మెంట్Ranveer Singh: విచిత్రమైన పరిస్థితిలో 'ధురంధర్' హీరో..పాపం హిట్ కొట్టి కూడా సుఖం లేదు!

Ranveer Singh: విచిత్రమైన పరిస్థితిలో ‘ధురంధర్’ హీరో..పాపం హిట్ కొట్టి కూడా సుఖం లేదు!

Ranveer Singh: ఫ్లాప్స్ మాత్రమే కాదు, భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఒక్కోసారి హీరోలను డైలమాలో పడేస్తుంటాయి. ఎలాంటి సినిమాలు చెయ్యాలో అర్థం కానీ పరిస్థితికి నెట్టేస్తుంటాయి. ప్రస్తుతం ‘ధురంధర్'(Dhurandhar movie) మూవీ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) పరిస్థితి అలాగే ఉంది. ‘ధురంధర్’ చిత్రం వరల్డ్ వైడ్ గా అంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవుతుతోందని రణవీర్ సింగ్ అసలు ఊహించలేదు. దీంతో ఆయన లింప్ చాలా సింపుల్ గా ఉండేది. కానీ ఒక్కసారిగా […]

Ranveer Singh: ఫ్లాప్స్ మాత్రమే కాదు, భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఒక్కోసారి హీరోలను డైలమాలో పడేస్తుంటాయి. ఎలాంటి సినిమాలు చెయ్యాలో అర్థం కానీ పరిస్థితికి నెట్టేస్తుంటాయి. ప్రస్తుతం ‘ధురంధర్'(Dhurandhar movie) మూవీ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) పరిస్థితి అలాగే ఉంది. ‘ధురంధర్’ చిత్రం వరల్డ్ వైడ్ గా అంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవుతుతోందని రణవీర్ సింగ్ అసలు ఊహించలేదు. దీంతో ఆయన లింప్ చాలా సింపుల్ గా ఉండేది. కానీ ఒక్కసారిగా ఇప్పుడు ‘ధురంధర్’ చిత్రం తో ఆయనకు ఓవర్ నైట్ సూపర్ స్టార్ స్టేటస్ వచ్చేసింది. మార్చి 19 న విడుదల అవ్వబోయే ‘ధురంధర్ 2’ తో ఆయన ఏకంగా 2000 కోట్ల క్లబ్ లోకి చేరబోతున్నాడు. టాక్ బాగుంటే 3000 కోట్ల క్లబ్ లోకి కూడా ఆ సినిమా చేరొచ్చు. అంతటి క్రేజ్ ఆ చిత్రం పై నెలకొంది.

అయితే ఈ సినిమా తర్వాత రణవీర్ సింగ్ కి ఎలాంటి సినిమా చెయ్యాలి అనే దానిపై క్లారిటీ రావడం లేదట. ‘ధురంధర్’ కి ముందు ఆయన ‘డాన్ 3’ చిత్రం లో నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ అయ్యేట్టు ఉండడంతో, రణవీర్ సింగ్ కి అప్పట్లో అంత పెద్ద మార్కెట్ లేకపోవడం తో ఈ ఆలోచనని విరమించుకున్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆయనకు ‘ధురంధర్’ తర్వాత మార్కెట్ భారీ గా పెరగడం తో మళ్లీ ఇప్పుడు రణవీర్ సింగ్ చుట్టూ తిరుగుతున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు. అయితే రణవీర్ కి మాత్రం అసలు ‘డాన్ 3’ లో నటించడం పై ఎలాంటి ఆసక్తి లేదట. ఇది కాకుండా ‘ధురంధర్’ కి ముందు శక్తి మ్యాన్ సిరీస్ ని సినిమా గా చేద్దామని అనుకున్నాడట. కానీ బడ్జెట్ సహకరించకపోవడం ఆ చిత్రాన్ని పక్కన పెట్టేసారు.

ఇవి రెండు కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ‘అపరిచితుడు’ రీమేక్ చెయ్యాలని అనుకున్నాడు. పెన్ స్టూడియోస్ తో ఒప్పందం కూడా జరిగింది. కానీ ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అవ్వడం తో రణవీర్ సింగ్ శంకర్ నుండి తప్పించుకున్నాడు. దీంతో పాటు ప్రశాంత్ వర్మ తో ‘బ్రహ్మ రాక్షస’ అనే చిత్రాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఇది కూడా క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ‘ప్రళయ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది కూడా ‘ధురంధర్’ కి ముందు ఒప్పుకున్న చిత్రం. ముంబై లో జాంబీలు ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని హాలీవుడ్ తరహాలో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా తప్ప రణవీర్ సింగ్ మరో చిత్రాన్ని ఒప్పుకోలేదు. చూడాలి మరి ఏ సినిమా చేయబోతున్నాడు అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper