Vaala 2 Movie Review: ఈ మధ్య కాలంలో చిన్న కాన్సెప్ట్ తో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. మలయాళం సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ‘వాలా’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే దానికి సీక్వెల్ గా ‘వాలా 2’ సినిమా చేశారు. ఈరోజు ఆ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. మొత్తానికైతే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
స్కూల్లో చదువుకునే ఒక నలుగురు కుర్రాళ్ళు సరిగ్గా చదువుకోకుండా గొడవలు పెట్టుకొని వాళ్ల పేరెంట్స్ ను ఇబ్బంది పెడుతుంటారు. ప్రతి రోజు ఇలా వాళ్ల ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెడుతుంటారు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళు తమ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసి వేరే కంట్రీకి వెళ్ళాలని అనుకుంటారు. మరి వాళ్ల డ్రీమ్ ను వాళ్ళు ఫుల్ ఫిల్ చేసుకున్నారా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకుడు షావిన్ షా ఈ సినిమాను మొదటి పార్ట్ మాదిరిగానే చాలా జోష్ ఫుల్ గా నడిపించాడు. నిజానికి మొదటి పార్ట్ కి ఈ సినిమా కి మధ్య కనెక్షన్ ఏమి లేదు…ఆ సినిమా చూడకపోయిన ఈ మూవీ చూడవచ్చు…సినిమాని చాలా టాప్ రేంజ్ లో స్టార్ట్ చేశారు. సినిమా మిడిల్ కి వచ్చేసరికి మాత్రం కొంతవరకు డల్ అయింది. ఇక ఇంటర్వెల్ కి వచ్చేసరికి హై ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకండాఫ్ లో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తాయి. అక్కడక్కడ సినిమా గాడి తప్పినట్టుగా అనిపించినప్పటికి దర్శకుడు వెంటనే తేరుకొని సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఈ సినిమాను ఒక యూత్ ఫుల్ సబ్జెక్టుగా తీసుకురావడమే కాకుండా స్టూడెంట్స్ ఎలా ఉండాలి. వాళ్ళ లైఫ్ లో ఎలాంటి తప్పులు చేస్తున్నారు. వాళ్ళు సరైన మార్గాన్ని ఎంచుకోవాలనే విషయాన్ని చాలా క్లారిటిగా చెప్పే ప్రయత్నం చేశాడు…
దర్శకుడు సైతం ఈ సినిమాని చాలా క్యాజువల్ గా నడిపించాడు. ఇక ఫ్రీ క్లైమాక్స్ లో సినిమా మీద భారీ హైప్ ను పెంచే ప్రయత్నం చేశారు… క్లైమాక్స్ ను సైతం చాలా కాన్ఫిడెంట్ గా ముగించారు. మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది… ఎమోషనల్ సన్నివేశాలను మలచిన తీరు కూడా బావుంది. ఆ సీన్స్ కి బ్యా గ్రౌండ్ స్కోర్ ఆడ్ అవ్వడంతో ఆ సీన్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్…
హషీర్ హెచ్, అలాన్ బి సిరాజ్, అజిన్ జో, వినాయక్ వి, వేద శంకర్ లాంటి నటి నటులు ఈ సినిమాను ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లారు… ప్రతి సీన్లో ఒక ఇంటెన్సితో పర్ఫార్మ్ చేయడంలో వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. కుర్రాళ్ళు ఎలా ఉంటారు వాళ్లు హవా భావాలను ఎలా పండిస్తారు. అలాగే పేరెంట్స్ దగ్గర ఎలా ఉంటారు.
ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనే విషయాల్లో వీళ్ళందరు చాలా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు… నిజానికి అందరు అలా జన్యున్ గా నటించడం అనేది చాలా కష్టతరం…దర్శకుడు ఏదైతే పేపర్ మీద రాసుకున్నాడో దానికి ఈ ఆర్టిస్టులు అందరు న్యాయం చేశారు… ఇక వీళ్ళతో పాటుగా మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఈ సినిమాకి మ్యూజిక్ బాగాలేదు. పాటల పరంగా చూసుకుంటే అంత ఎఫెక్ట్ గా అనిపించనప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తన ప్రతిభను చూపించాడు. కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా టచ్ చేయడంలో తన మ్యూజిక్ అయితే చాలా వరకు హెల్ప్ అయింది… ఎడిటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా చాలా వరకు చాలా పర్ఫెక్ట్ గా ఎడిట్ చేస్తూ సినిమా మీద హైప్ ని పెంచే ప్రయత్నం చేశారు.ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సైతం చాలా ఎఫెక్టివ్ గా ఉండడంతో సినిమాకి గ్రాండ్ ఇయర్ లుక్ అయితే వచ్చింది…
ఈ సినిమాలో బాగోలేనివి
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించాయి…
పాటలు అంత క్యాచీ గా లేవు
ఈ మూవీలో బాగున్నవి
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
సెకండాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు…
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
రేటింగ్ : 2.5/5