Homeఎంటర్టైన్మెంట్Geetha Madhuri controversial comments: ఆ విషయాలు బయటపెడితే మీ కాపురాలు కూలిపోతాయ్ అంటూ సింగర్...

Geetha Madhuri controversial comments: ఆ విషయాలు బయటపెడితే మీ కాపురాలు కూలిపోతాయ్ అంటూ సింగర్ గీతా మాధురి హాట్ కామెంట్స్..

Geetha Madhuri controversial comments: టాలీవుడ్ టాప్ సింగర్స్ లిస్ట్ తీస్తే మనకు బాగా గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి గీత మాధురి(Geetha Madhuri). గడిచిన 15 ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఈమె మోస్ట్ బిజీ సింగర్ గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూనే ఉంది. చూసేందుకు హీరోయిన్ లాగా ఉంటుంది కానీ , ఎందుకో నటిగా మాత్రం ఆమె ప్రయత్నం చేయలేదు. ఈమెకు సోషల్ మీడియా లో ఉన్న […]

Geetha Madhuri controversial comments: టాలీవుడ్ టాప్ సింగర్స్ లిస్ట్ తీస్తే మనకు బాగా గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి గీత మాధురి(Geetha Madhuri). గడిచిన 15 ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఈమె మోస్ట్ బిజీ సింగర్ గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూనే ఉంది. చూసేందుకు హీరోయిన్ లాగా ఉంటుంది కానీ , ఎందుకో నటిగా మాత్రం ఆమె ప్రయత్నం చేయలేదు. ఈమెకు సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ కూడా మామూలుది కాదు. ఈమెకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది . ఆ ఫ్యాన్ బేస్ కారణం గానే ఈమె ‘బిగ్ బాస్ 2’ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. బిగ్ బాస్ చరిత్ర లోనే మోస్ట్ కాంట్రవర్షియల్ గా నిల్చిన సీజన్ 2 లో ఈమె రన్నరప్ గా నిల్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈమె రేంజ్ ఏంటి అనేది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ప్రముఖ సింగర్ , నటుడు , బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ నోయల్ సేన్ యూట్యూబ్ ఛానెల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ ‘అప్పుడప్పుడు నేను కాఫీ షాప్ కి వెళ్తుంటాను , నా కర్మ ఏంటో తెలియదు కానీ , నేను వెళ్ళినప్పుడే కొన్ని ప్రేమ జంటలు నా కంట పడుతుంటాయి. సినీ ఇండస్ట్రీ లో వాళ్లకు మంచి పేరు కూడా ఉంది. ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు బయట పెడితే , పాపం వాళ్ళ కాపురాలు కూలిపోతాయి’ అంటూ చెప్పుకొచ్చింది. కాపురాలు కూలిపోతాయి అని అంటుందంటే , కచ్చితంగా పెళ్లి అయిన వాళ్ళే సీక్రెట్ రిలేషన్స్ ని మైంటైన్ చేస్తున్నారని అర్థం.

ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేపింది. ఇంతకీ ఆమె ఏ ప్రేమ జంట ని చూసి ఉంటుంది?, సీక్రెట్ రిలేషన్స్ ని ఎవరు మైంటైన్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో చర్చ మొదలైంది. ఇదంతా పక్కన పెడితే గీత మాధురి భర్త నందు కూడా సినీ రంగానికి చెందిన వాడే అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు , క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు , కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన డీ డ్యాన్స్ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper