Ustaad Bhagat Singh: మరో 43 రోజుల్లో పవర్ స్టార్(Deputy CM Pawan Kalyan) సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవర్ స్టార్ సినిమా అంటే ఆ హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానులు ఆయన సినిమా విడుదలని ఒక పండుగ లాగా జరుపుకుంటారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని కూడా ఆ రేంజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు సిద్దంగానే ఉన్నారు. కానీ మేకర్స్ మాత్రం నత్త నడకన ప్రొమోషన్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు గ్లింప్స్ వీడియోలు విడుదలై దాదాపుగా రెండేళ్లు కావొస్తుంది. ఇక ఆ తర్వాత డిసెంబర్ నెలలో ఈ చిత్రం నుండి ‘దేఖ్లేంగే సాలా’ అనే పాటని విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ట్యూన్ మాత్రం చాలా యావరేజ్ రేంజ్ లో ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.
ఈ పాట సినిమా పై అంచనాలు పెంచలేదు, అలా అని అంచనాలు తగ్గించలేదు. ఇలాంటి కంటెంట్ వల్ల సినిమాకి ఒరిగేది ఏమి లేదు. ఒక బ్లాస్టింగ్ కంటెంట్ రావాలి, అప్పుడే హైప్ వస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం నుండి రెండవ పాట కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శివరాత్రికి వస్తుందని అనుకున్నారు కానీ, అప్పటికి కేవలం ఈ పాటకు సంబంధించిన పోస్టర్ ని మాత్రమే విడుదల చేస్తారట. మేకర్స్ ప్రొమోషన్ కంటెంట్ ని వదిలే విషయంలో ఇంత అలసత్వం చూపిస్తున్నారు. ఇది పక్కన పెడితే కనీసం బిజినెస్ ని కూడా మొదలు పెట్టడం లేదు. రెండు నెలల తర్వాత విడుదల అవ్వబొయె రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ బిజినెస్ కూడా మొదలు పెట్టేసారు, కానీ మేకర్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బిజినెస్ ని మాత్రం మొదలు పెట్టలేదు.
ఎందుకంటే ఒక్కో ప్రాంతానికి నిర్మాతలు డిమాండ్ చేస్తున్న రేట్స్ తారాస్థాయిలో ఉన్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కేవలం ఒక రొటీన్ కమర్షియల్ సినిమా మాత్రమే. ఇలాంటి సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ బిజినెస్ చేయాలంటే ఎలా చెప్పండి?, 43 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని, ఇప్పటి వరకు ఓవర్సీస్ డీల్ క్లోజ్ చేయలేదు. సాధారణంగా ఈమధ్య కాలం లో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నెల రోజుల ముందే మొదలు అవుతున్నాయి. కానీ ఈ చిత్రానికి నెల రోజుల ముందు ఇంకా బిజినెస్ డీల్ క్లోజ్ అవ్వలేదు. ఎవరు విడుదల చేయబోతున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. అలా ఉంది పరిస్థితి. త్వరగా బిజినెస్ ని మొదలు పెట్టి, మిగిలిన ఫార్మాలిటీస్ ని పూర్తి చేస్తే కానీ ఈ చిత్రం పై ఒక అంచనాకు రాలేము అంటూ చెప్తున్నారు విశ్లేషకులు.