Ustaad Bhagat Singh interval twist: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకోవడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. చేసిన సినిమాలు చేసినట్టు సక్సెస్ లను సాధిస్తే తప్ప ఇక్కడ గొప్ప గుర్తింపైతే రాదు. ఒక్క సినిమాతో సక్సెస్ ని సాధించి ఆ తర్వాత కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం స్టార్ హీరోగా అవతరించాడు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన మేనరిజమ్స్ తో యూత్ భారీ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ గత సంవత్సరం ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట. ఈ సీన్ లో హీరో ఫ్రెండ్ గా నటిస్తున్న ఒక ప్రముఖ నటుడు చనిపోతారట. ఇంతకీ ఆ నటుడు ఎవరు అనే విషయాన్ని ఎక్కడ రివీల్ చేయనప్పటికి అదొక హై ఫీల్ నిచ్చే ఎమోషన్ గా మనకు చెబుతున్నాడు. ఇక ఆ క్రమంలోనే ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందట.
Also Read: ఆ సినిమా ప్లాప్ అవుతుందని ముందు తెలుసు అయిన పూర్తి చేశాను: అల్లు అర్జున్…
మన హరీష్ శంకర్ ఈ సినిమాని ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడు. ఓజీ సినిమా ను మించి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? కమర్షియల్ హంగులతో ముస్తాబ్ చేస్తున్న ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…ఇక ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే హరీష్ శంకర్ కి మరి కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలను చేసే అవకాశమైతే వస్తుంది…