Homeబిజినెస్Nissan Gravite MPV: ఇక మీరు Nissan కొత్త కారు కొనవచ్చు.. ధర రూ.6 లక్షల...

Nissan Gravite MPV: ఇక మీరు Nissan కొత్త కారు కొనవచ్చు.. ధర రూ.6 లక్షల లోపే..

Nissan Gravite MPV: MPV కార్లు కొనాలని అనుకునేవారు Nissan కంపెనీ శుభవార్త తీసుకువచ్చింది. ఈ కంపెనీకి చెందిన MPV Gravite అనే కారును ఇటీవల అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెనాల్ట్ డ్రైవర్ ఫ్లాట్ ఫామ్ నుంచి తయారైన ఈ కారు పూర్తిగా పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది అంతే కాకుండా గ్రావెట్ నుంచి ఇది మూడో సిరీస్ గా చెప్పబడుతుంది. వినియోగదారులకు అనుగుణంగా సీటింగ్ సౌకర్యంతో పాటు లాంగ్ డ్రైవ్ చేసేవారికి దీని ఇంజన్ ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే స్మార్ట్ ఫీచర్స్ డ్రైవర్లకు అనుగుణంగా ఉండనున్నాయి. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Nissan gravite MPV పూర్తిగా పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా.. ఇది 72 హార్స్ పవర్ ను అందిస్తుంది. 96 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది.5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పనిచేసే ఈ ఇంజన్ ఫ్యూయల్ 40 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి అనుగుణంగా ఉంటుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్స్ను అమర్చారు. 20.32 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. సౌకర్యవంతమైన సీటింగ్ తో పాటు బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో లాంగ్ జర్నీ చేసినా కూడా ఎలాంటి అలసట అనిపించదు. ఈ సీట్లు పూర్తిగా లెదర్ తో కూడుకొని ఉండగా డ్యూయల్ డాష్ బోర్డు సౌకర్యాన్ని అందిస్తుంది. విశాలమైన క్యాబిన్ ఉండడంతో కంఫర్ట్ గా ప్రయాణం చేయవచ్చు. అలాగే డ్యూయల్ డ్యాష్ కామ్, వైర్లెస్ ఛార్జింగ్, ప్రీమియం సౌండ్, ఎయిర్ ప్యూరిఫై, వైర్లెస్ చార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ కూడా రక్షణను అందిస్తాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ESC, TCS, EBD తో ABS వంటి టెక్నాలజీ అనుగుణంగా ఉంది. హిల్ స్టార్ట్ అసిస్టెంట్, రియల్ పార్కింగ్ సెన్సార్ ఉండడంవల్ల ప్రయాణికులకు అత్యంత రక్షణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ కారును రూ.5.67 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. ఎక్స్టీరియర్ డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. దీనికి LED హెడ్ లాంప్స్, క్రిస్టల్ ఎడ్జ్ LED టెయిల్ లాంప్స్ వంటివి ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే నిస్సాన్ నుంచి త్వరలో gravet 5 seater, 6 Seater కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular