Harish Shankar confidence on Ustaad Bhagat Singh: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తీయడంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ గతంలో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కమర్షియల్ గా సక్సెస్ ని సాధించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాను ఈనెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మీద భారీ హైప్ ఉన్నప్పటికి హరీష్ శంకర్ మాత్రం లేదంటే ఇతరుల ఫంక్షన్స్ లోకి వచ్చి వస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు. విషయాన్ని హైలెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్న విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులైతే పండుగ చేసుకుంటున్నారు. సినిమా గురించి మాట్లాడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ముందు నుంచి కూడా భారీ హైప్ ఉంటుంది.
ఇక దానికి హరీష్ శంకర్ మాటలతో ఓవర్ హైప్ ని క్రియేట్ చేస్తున్నాడు. దీనివల్ల సినిమాకి ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాని ఎలాంటి అంచనాలు లేకుండా చూసినప్పుడు ఆ సినిమా అందరికి నచ్చుతుంది.
Also Read: మహేష్ బాబు చేసిన ఆ ఒక్క పనికి కృష్ణ చాలా రోజులు ఇబ్బంది పడ్డాడా..?
కానీ భారీ అంచనాలు క్రియేట్ అయినప్పుడు వల్ల అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోతే మాత్రం సినిమా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఇక హరీష్ శంకర్ ఎందుకని ఇలా తన సినిమాలకు తనే నెగెటివ్ టాక్ వచ్చేలా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో రవితేజతో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విషయంలో కూడా ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ ఆ సినిమాకి భారీగా మైనస్ అయింది అంటూ చాలామంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేశారు… ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుంది ఆయన ఇచ్చిన హైప్ సక్సెస్ ఫుట్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…