https://oktelugu.com/

Prabhas-Pawan Kalyan: ప్రభాస్ పవన్ కళ్యాణ్ కాంబో లో రానున్న మల్టీస్టారర్ మూవీ… ఇంతకీ డైరెక్టర్ ఎవరంటే..?

Prabhas-Pawan Kalyan: ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో తనను తాను పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 28, 2024 / 10:10 AM IST

    Upcoming multistarrer movie in Prabhas Pawan Kalyan combo

    Follow us on

    Prabhas-Pawan Kalyan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈయన చేసిన సినిమాలు పాన్ ఇండియాలో అద్భుతాలను క్రియేట్ చేయడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదిగిన తెలుగు హీరోగా కూడా తను మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ‘కల్కి ‘(Kalki) సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి ఆయన భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక తెలుగు లో పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఓ జి(OG) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో తనను తాను పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని పెట్టి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) ఈమధ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

    Also Read: NTR Birth Anniversary: తెలుగువారి మదిలో చెరపలేని ముద్ర ఎన్టీఆర్

    అయితే ఈ ఇద్దరిని కనక ఒకే స్క్రీన్ మీద చూపించగలిగితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను కూడా రాబడుతుంది అంటు తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ వీళ్ళిద్దరికీ సరిపడా కథను కూడా తను రెడీ చేసుకున్నట్టుగా తెలియజేశాడు. ఇక అవకాశం దొరికితే వీళ్ళిద్దరిని పెట్టి సినిమా చేస్తానని తను చెప్పడంతో ఇప్పుడు ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…

    Also Read: OG Movie: ఓజీ టైటిల్ వెనక ఉన్న కథ ఏంటంటే..?

    ఇక ఇప్పటికే సుజీత్ ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి ని కలిపి ఒక సినిమా చేస్తాడా లేదా ఒక వేళ చేస్తే అది ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…