Food Safety: హోటల్స్‌ లో తినేవారంతా ఈ వీడియో చూడాలి

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నారు. చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ సరుకులు, నాసిరకం పదార్థాలు, ఇక రోజుల తరబడి నిల్వ ఉంచే మాంసం, కుళ్లిన పదార్థాలు పట్టుపడుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : May 28, 2024 10:12 am

Food Safety

Follow us on

Food Safety: ఇంట్లో ఎంత రుచిగా వంట చేసుకున్నా.. చాలా మందికి రుచించదు. అదే హోటల్, రెస్టారెంట్‌ నుంచి స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్‌ పెట్టి.. వేడివేడిగా ఇంటికి వచ్చాక లొట్టలేసుకుంటూ తింటారు. ఇటీవల ఈ కల్చర్‌ బాగా పెరిగింది. ఇంట్లో నాన్యమైన, తాజా వస్తువులతో వంట చేసినా తినడానికి ఇష్టపడడం లేదు. బయటి ఫుడ్‌ అనగానే లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. కొందరైతే వారానికి రెండు మూడు సార్లు, ఇంకొందరు వీకెండ్స్‌లో హోటళ్లకు వెళ్లి మరీ తింటున్నారు. అయితే ఇలా హోటల్స్‌ ఫుడ్‌ తెప్పించుకునేవారు, హోటళ్లకు వెళ్లి తినేవారు చూడాల్సిన వీడియో ఇది.

రోజుల తరబడి నిల్వ..
ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నారు. చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ సరుకులు, నాసిరకం పదార్థాలు, ఇక రోజుల తరబడి నిల్వ ఉంచే మాంసం, కుళ్లిన పదార్థాలు పట్టుపడుతున్నాయి. చిన్న చిన్న హోటళ్లే కాదు, టూస్టార్, త్రీస్టార్‌ హోటళ్లలో కూడా ఇలాంటివి దొరకడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చాలా హోటళ్ల యజమానులు కస్టమర్ల ఆరోగ్యం కన్నా.. తమ సంపాదనపైనే దృష్టిపెడుతున్నారు. దీంతో ఈరోజు మిగిలిపోయిన పదార్థాలను రేపు, రేపు మిగిలిపోతే ఎల్లుండి ఇలా రోజుల తరబడి నిల్వ చేసి వాటికే తిరిగి మసాలాలు దట్టించి, నూనెలో వేయించి తిరిగి కస్టమర్లకు వడ్డిస్తున్నారు.

ఖమ్మంలో ఇలా..
సోషల్‌ మీడియాలో ఖమ్మంలోని ఓ రెస్టారెంట్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పట్టుకున్న ఆహార పదార్థాల వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఇందులో నిల్వ చేసిన చికెట్‌ ఐటమ్స్, కబాబ్స్‌ ఉన్నాయి. వీటితోపాటు వంటల తయారీకీ హోటల్‌లో వాడుత్ను కొబ్బరి పొడి, నూడుల్స్‌ వంటి రా మెటీరియల్‌ కూడా నాసిరకమైనవే అని తేచ్చారు. వెంటనే వీటిని ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు డ్రెయినేజీలో పడేయించారు. ఈ ఫుడ్‌ ఐటమ్స్‌ ఖమ్మం బైపాస్‌ రోడ్డులో ఉన్న రెస్టారెంట్‌లో దొరికాయి. మరోసారి ఇలా నిల్వ చేస్తే హోట్‌ సీజ్‌ చేస్తామని యజమానిని అధికారులు హెచ్చరించారు.

స్పందిస్తున్న నెటిజన్లు..
ఇక సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఖమ్మం హోటల్‌ ఫుడ్‌ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వందల రూపాయలు తీసుకుంటున్న హోటళ్ల నిర్వాహకులు ఇలా కస్టమర్ల ప్రాణాలతో చెలగాడం ఆడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హోటళ్లను సీజ్‌ చేయాలని కోరుతున్నారు. కొందరు నిల్వ చేసి ఆహారాన్ని హోటల్‌ నిర్వాహకులతోనే తినిపించాలని కోరుతున్నారు. జైల్లో పెట్టాలని మరికొందరు కామంట్‌ చేస్తున్నారు.