Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Sridevi Drama Company: అందరి చేత కన్నీరు పెట్టించిన జబర్దస్త్ కమెడియన్... కారణం ఏమిటీ? వైరల్...

Sridevi Drama Company: అందరి చేత కన్నీరు పెట్టించిన జబర్దస్త్ కమెడియన్… కారణం ఏమిటీ? వైరల్ వీడియో!

Sridevi Drama Company: ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ బుల్లితెర టాప్ రేటెడ్ షోగా దూసుకుపోతుంది. మంచి ప్రేక్షకాదరణ అందుకుంటుంది. ప్రతి ఆదివారం సరికొత్త థీమ్ తో ఆడియన్స్ ని శ్రీదేవి డ్రామా కంపెనీ అలరిస్తుంటుంది. ఇక తాజా ఎపిసోడ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుల్లితెర కమెడియన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటుంది. హీరో సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చి షోలో సందడి చేశారు.

ముందుగా ఆటో రాంప్రసాద్ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను… అందరూ ఓటు వేయాలని కోరాడు. ఇంతలో నరేష్ వచ్చి తాను కూడా పోటీ చేస్తున్నాను అని చెప్పి రాంప్రసాద్ కి షాకిచ్చాడు. ఇక ఫైమా దగ్గరకు వెళ్లి రాంప్రసాద్ తనకు ఓటు వేయమని అడిగాడు. నేను కూడా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాను. నా గుర్తు పిడకా నేను ఏమి చేసినా దొరకా అంటూ కామెడీ చేసింది. ఆ తర్వాత నూకరాజు వరసపెట్టి అందరిపై పంచులు వేసాడు.

ఫైమాని ఒక ఆట ఆడుకున్నాడు. రేసుగుర్రం సినిమాలో ఒక సాంగ్ ని ఖూనీ చేశాడు. ఫైమా పై పేరడీ చేస్తూ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక నృత్యాలు వంటివి ప్రదర్శించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసి అమరులైన వారిని ఉద్దేశిస్తూ నూకరాజు పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించింది. నెలల తరబడి సాగిన తెలంగాణా ఉద్యమంలో అనేక మంది యువకులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.

ఇక గెస్ట్ గా వచ్చిన హీరో సుదీర్ బాబు శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే ఒక చిన్నారి సుధీర్ బాబుని దెయ్యం ఏది అని అడగ్గా .. ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. యాంకర్ రష్మీ ని ఉద్దేశిస్తూ ఒక దెయ్యం ఉంది కాబట్టి మరో దెయ్యం రాదు అంటూ చిన్నారితో చెప్పాడు. దీంతో నవ్వులు పూశాయి. కాగా లేటెస్ట్ ప్రోమో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. తాజా ఎపిసోడ్ పై ప్రోమో అంచనాలు పెంచేసింది.

 

Sridevi Drama Company Latest Promo | 2nd June 2024 | Rashmi,Indraja, Ramprasad | ETV Telugu

Exit mobile version