https://oktelugu.com/

OG Movie: ఓజీ టైటిల్ వెనక ఉన్న కథ ఏంటంటే..?

OG Movie పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటుంది. ఇక పొలిటికల్ గా ఆయన జనసేన పార్టీ పెట్టి రాజకీయంగా కూడా రాణిస్తున్నప్పటికీ ఆయనకు సమయం దొరికిన ప్రతిసారి సినిమాలు తీస్తూ తన అభిమానులను అలరిస్తూ వస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 28, 2024 / 07:40 AM IST

    OG Movie

    Follow us on

    OG Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలే అతన్ని మనకు చాలా గొప్పగా పరిచయం చేశాయి. ఇక ఇప్పటివరకు ఆయన ఎంచుకున్న ప్రతి సినిమా కూడా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఒక మంచి క్రేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాయి.

    కాబట్టి ఆయన సినిమాలకి ఉన్న క్రేజ్ తెలుగులో మరే హీరో సినిమాలకి ఉండదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటుంది. ఇక పొలిటికల్ గా ఆయన జనసేన పార్టీ పెట్టి రాజకీయంగా కూడా రాణిస్తున్నప్పటికీ ఆయనకు సమయం దొరికిన ప్రతిసారి సినిమాలు తీస్తూ తన అభిమానులను అలరిస్తూ వస్తున్నారు.

    ఇక అందులో భాగంగానే ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్ లో ఓ జి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ఓజి అనే టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి అనేది రీసెంట్ గా సుజీత్ తెలియజేశారు. అది ఏంటి అంటే ఓజీ అంటే “ఓజాస్ గంభీర” అని అతను తెలియజేశాడు. జపనీస్ స్టైల్లో ఈ సినిమా ఉండబోతున్నట్టుగా కూడా చెప్పాడు. ఇక ఎప్పటినుంచో అతను పవన్ కళ్యాణ్ తో జపనీస్ టైప్ ఆఫ్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇక తనకు అనుకోకుండా ఈ అవకాశం రావడంతో అదే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

    ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఈ సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకొని సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కనక అందుకున్నట్లైతే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు…ఇక మొత్తానికైతే సుజీత్ ఈ సినిమాతో ఇక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు… చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుందో…