Homeఎంటర్టైన్మెంట్Anganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’గా రాబోతున్న నవీన్..!

Anganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’గా రాబోతున్న నవీన్..!

Anganaga Oka Raju: ‘జాతిరత్నం’ మూవీతో సాలీడ్ హిట్టుకొట్టిన నవీన్ పోలిశెట్టి త్వరలోనే ‘అనగనగా ఒక రాజు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ కూడా ‘జాతిరత్నాలు’ తరహాలోనే కామెడీ జోనర్లో తెరకెక్కినట్లు టాక్ విన్పిస్తోంది. ఇక ఈ మూవీతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.

‘అనగనగా ఒక రాజు’ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు కల్యాణ్ శంకర్ సంక్రాంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేశాడు. రెండు నిమిషాల 11సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రాజు(నవీన్ పొలిశెట్టి) ఇంట్రడక్షన్ ను మూవీ మేకర్స్ బీభత్సంగా చూపించారు.

రాజుగాడి పెళ్లంటూ నవీన్ పోలిశెట్టి బిల్డప్ బాబాయ్ ఓ రేంజులా మాట్లాడటం నవ్వులు పూయించింది. పెళ్లి కొడుకు గెటప్ లో నవీన్ తన పెళ్లి గురించి.. తన వెనుక ఉన్న డబ్బు గురించి బిల్డప్ లు ఇవ్వడమే టీజర్ మొత్తం కన్పించింది. ఈ టీజర్ చివరి వరకు పరిశీలిస్తే  ‘అనగనగా ఒక రాజు’ పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లు అర్థమవుతోంది.

టీజర్లో నవీన్ పోలిశెట్టి నటన అద్భుతంగా ఉంది. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ టీజర్ మొత్తంలో నవీన్ పొలిశెట్టి బిల్డప్ మాత్రమే ఉండటంతో హీరోయిన్ ఎవరా? అనే సస్పెన్స్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. హీరోయిన్ పేరును త్వరలోనే ఖరారు చేసే అవకాశం కన్పిస్తోంది.

ఈ మూవీని ‘సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ప్రొడక్షన్ నంబర్ 15గా తీసుకు రాబోతున్నారు. సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్యలు ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  మ్యూజికల్ సన్సేషన్ థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper