Omicron Delta: కరోనా రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా ఒమిక్రాన్ రూపంలో కేసుల సంఖ్యను పెంచుతోంది. సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ దేశంలో లక్షల మందికి సోకి మరణ మృదంగం వాయించింది. ఇప్పుడు ప్రస్తుతం ఒమిక్రాన్ ఆ బాధ్యత తీసుకుంది. ఈ క్రమంలోనే ఒమిక్రాన్, డెల్టాకు ప్రధాన తేడాలను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా పరిశోధనలు, చికిత్స పొందిన రోగుల వ్యక్తిగత పరిశీలన ఆధారంగా ఈ రెండు వేరియంట్ల మధ్య తేడాను గుర్తిస్తున్నారు.

డెల్టా వేరియంట్ బారిన పడ్డ వారికి పొడిదగ్గు వస్తుందని.. అదే ఒమిక్రాన్ బాధితులకు తడిదగ్గుతో బాధపడుతారని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ కేసుల్లో ఇదే పోలిక ఉందని చెబుతున్నారు. ఎక్కువ మంది రోగుల్లో కనిపించిన లక్షణాల ఆధారంగా ఈ విషయం గుర్తించారు.
-ఒమిక్రాన్ వచ్చిన వారిలో 101 డిగ్రీల కంటే తక్కువ జ్వరం ఉంటుందని తేలింది. తీవ్రమైన తలనొప్పి, గొంతు గరగర ఉండడం ఎక్కువగా గుర్తించినట్టు వైద్యులు చెబుతున్నారు. కండ్ల కలక, వాసన కోల్పోవడం.. నాడీ సంబంధ లక్షణాలు డెల్టా వేరియంట్ లో ఎక్కువగా కనపడ్డట్టుగా వైద్యులు చెబుతున్నారు.
డెల్టా వైరస్ సోకితే శరీరంపై ఎఫెక్ట్ భారీగా పడిందని.. అయితే ఒమిక్రాన్ చికిత్స మరో రకంగా ఉంటుందని.. లక్షణాలు బట్టి పరిశీలించాలని వైద్యులు సూచిస్తున్నారు.
డెల్టా వలే ఒమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదని తేలింది. ఒమిక్రాన్ సోకిన వారికి కండరాల నొప్పితోపాటు 1-2 రోజులు అలిసిపోయినట్టుగా అనిపిస్తోందన్నారు. గొంతునొప్పి, తలనొప్పి మరియు, చాతినొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఒమిక్రాన్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారినపడుతున్నట్టు తేలింది.
[…] Bhama Kalapam Movie: బుల్లితెర పై తన యాంకరింగ్ తో లెజండ్ అనిపించుకున్న సుమ లీడ్ రోల్ లో ఒక సినిమా చేస్తోంది. జయమ్మ పంచాయితీ అనే ఈ చిత్రంలో ‘సుమ’నే మెయిన్ లీడ్. ఇక ఇటీవల సుమ పాత్ర స్వభావాన్ని తెలుపుతూ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పక్కా పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ పాట బాగుంది అంటూ మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది. సుమ అభిమానులు కూడా ఈ సాంగ్ పై ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపించారు. కాగా ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యాంకరింగ్ కాకుండా చాలా ఏళ్ల తర్వాత సుమ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మరీ ఈ జయమ్మ పంచాయితీ ఎలా ఉంటుందో చూడాలి. […]