Kohli: క్రికెట్ క్రీడను భారతీయులు అమితంగా ఇష్టపడుతుంటారు. ఈ సంగతి అలా ఉంచితే.. క్రికెట్ టీమ్‌లో గత కొద్ది కాలంగా అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులన్నీ కూడా కోహ్లీ చుట్టూ తిరుగుతుండటం గమనించ దగ్గిన విషయం అవుతున్నది. గతంలో వన్డే, టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ తాజగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటన కూడా చేశారు.

అలా భారత జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ పూర్తిగా తప్పుకున్నట్లయింది. అలా టీమిండియాలో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకం ముగిసినట్లయింది. కాగా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలపైన రకరకాల వార్తలొస్తున్నాయి. కాగా, ప్రధానమైన కారణంగా రహానే, పుజారా ఉన్నారని ఆరోపణలున్నాయి.
Also Read: బాలయ్య సందడి.. లక్ష్మిని ఎత్తి పడేసిన విష్ణు..!
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ బ్యాటర్లు అయిన చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే వీరిరువురిపైన కెప్టెన్సీ హోదాలో విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూంలో వీరిరువురి వైఫల్యంపైన కోహ్లీ బాగా సీరియస్ అయ్యారట. దాంతో వారు విరాట్ కోహ్లీపైన ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేశారని సమాచారం. అలా కోహ్లీ కెప్టెన్సీపైన వారు అసంతృప్తి వ్యక్తం చేశారని టాక్. అలా విరాట్ కోహ్లీ పైన ఒక్కొక్కటిగా మెల్లిగా వ్యతిరేక పవనాలు బలపడి చివరకు తనంతట తాను కెప్టెన్సీ ని వదులుకునేంత వరకు పరిస్థితులు వచ్చాయని పలువురు అంటున్నారు.
భారత కెప్టెన్సీ మార్పు విషయం 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాతే తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒకరి తర్వాత మరొకరు కోహ్లీ కెప్టెన్సీపైన అసంతృప్తి వ్యక్తం చేయగా, చివరగా తనంతట తానుగా కోహ్లీయే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు.
దక్షిణ ఆఫ్రికా పర్యటనకు వెళ్తున్న క్రమంలో అక్కడకు వెళ్లడానికి సిరీస్ జరుగుతున్న క్రమంలో పుజారా, రహానేను సెలక్ట్ చేయడం పట్ల కోహ్లీ అసహనం వ్యక్తం చేశారని వార్తలొస్తున్నాయి. నిజానికి వారిరువురిని సెలక్ట్ చేయడానికి కోహ్లీ ఇంట్రెస్ట్ చూపలేదని టాక్.
Also Read: ఏపీలో స్కూళ్ల సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన