Hari Hara Veeramallu Movie : తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్ర లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక సార్లు వాయిదా పడిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) నే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడో 2021 వ సంవత్సరం లో ఈ సినిమా మొదలైంది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా, లాక్ డౌన్ వల్ల చాలా కాలం వాయిదా పడింది. లాక్ డౌన్ తర్వాత ఒక రెండు నెలల పాటు రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ చేసారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల, ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది, ఈ నెల 28న ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది అని అభిమానులు ఆనందించారు కానీ, ఈ సినిమా 28న విడుదల కావడం లేదని మీడియా కి ఒక సమాచారం అందింది.
Also Read : హరి హర వీరమల్లు’ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేసిందిగా…పవన్ కళ్యాణ్ గాత్రానికి ఫిదా అవుతున్న అభిమానులు….
కారణం ఇంకా కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు పెండింగ్ లో ఉండడమే. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ లోని గండికోట లో షూటింగ్ ని జరుపుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం మంగళగిరి లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి ఫేమ్ సత్యరాజ్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా పాల్గొనబోతున్నాడు. ఆయనకు సంబంధించిన నాలుగు రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఆ షూటింగ్ పూర్తి అయ్యాక సినిమాకి గుమ్మడి కాయ కొట్టేస్తారు. ఈ నెలలోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. వచ్చే నెల 17వ తారీఖున విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మార్చి 15 తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ హాఫ్ మొత్తం రీ రికార్డింగ్ తో సహా పూర్తి అయ్యింది. ఐమాక్స్ వెర్షన్, 3D వెర్షన్ కి కూడా ఫస్ట్ హాఫ్ ని కన్వెర్ట్ చేసేసారు. కేవలం సెకండ్ హాఫ్ కి సంబంధించిన వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇకపోతే ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘కొల్లగొట్టినాదిరో’ పాట అయితే వేరే లెవెల్ లో ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ మొత్తానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నుండి విడుదలయ్యే ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు మేకర్స్. సినిమా గ్రాండియర్ ని తెలిపేలా ఇక నుండి ప్రమోషనల్ కంటెంట్ ని వదలబోతున్నారట. చూడాలి మరి ఆ కంటెంట్ ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు రేపుతోంది అనేది.
Also Read : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గ్యాంగ్ స్టర్ సినిమాల్లో మాస్టర్ పీస్ గా నిలువబోతుందా..?