Mahesh Babu and Star Heroines controversy: ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం అనేది సర్వసాధారణమే చాలా మంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ – రష్మిక మందాన సైతం లవ్ మ్యారేజ్ చేసుకోవడం విశేషం…ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు లాంటి నటుడు సైతం నమ్రత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహేష్ బాబు స్టార్ హీరోగా మారిన తర్వాత ఒక ఇద్దరు హీరోయిన్లు అతన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేసినట్టుగా గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి… ఇక మహేష్ తో వాళ్లు రెండు సినిమాలు చేసిన హీరోయిన్లు కావడం విశేషం… ఇక ఎప్పటికప్పుడు నమ్రత మహేష్ బాబు విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఆ హీరోయిన్స్ యొక్క యాక్టివిటీస్ గమనించిన నమ్రత వాళ్ళిద్దరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఆ తర్వాత నుంచి వాళ్ళు మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని కూడా కోల్పోయారు.
మహేష్ సైతం వాళ్ళందరిని పట్టించుకోకుండా నమ్రత చెప్పినట్టుగానే తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
దానికోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. సినిమాకి ఏం కావాలో అది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయితే వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోనే మహేష్ బాబుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపైతే వస్తుంది. దాని కోసమే ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు… ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరిలో కూడా తను టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతాడు.
1300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడినట్లైతే మాత్రం మహేష్ బాబు గ్రాఫ్ ఒక్కసారిగా తారాస్థాయికి వెళ్ళిపోతుంది. తనతో సినిమాలు చేయడానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఉన్న చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించిన ఆశ్చర్యపోనవసరం లేదు…