Sharmitha Gowda Vacation Photos: మోస్ట్ రేటెడ్ తెలుగు సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. కావ్య-రాజ్ గిల్లికజ్జాలు, కెమిస్ట్రీ ఈ సీరియల్ కి హైలెట్. బ్రహ్మముడి సీరియల్ లో లేడీ విలన్ రుద్రాణి పాత్ర సుపరిచితమే. దుగ్గిరాల వారి ఇంట్లో ఉంటూ ఆ ఫ్యామిలీ మీద కుట్రలు చేసే ఫ్యామిలీ మెంబర్ గా రుద్రాణి పాత్ర ఉంటుంది. రుద్రాణి పాత్రను కన్నడ నటి షర్మిత గౌడ చేశారు.
మరో విలన్ రాహుల్ తల్లిగా, స్వప్నకు అత్తగా ఆమె పాత్ర ఉంటుంది. అత్త పాత్ర అయినప్పటికీ షర్మిత గౌడ చాలా గ్లామరస్ అండ్ యంగ్ గా కనిపిస్తుంది. అందుకు కారణం ఆమె వయసే. నిజానికి షర్మితది అత్త పాత్రలు చేసే ఏజ్ కాదు. చెప్పాలంటే బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ కంటే తక్కువ వయసు. 1990లో పుట్టిన షర్మిత గౌడ వయసు కేవలం 35 ఏళ్ళు మాత్రమే. హీరోయిన్ పాత్రలు చేయాల్సిన ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది.
Also Read: దిల్ రాజుకు ఏమైంది? ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్న స్టార్ ప్రొడ్యూసర్!
కన్నడలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. పలు చిత్రాలు, సీరియల్స్ లో నటించింది. తమిళ సీరియల్స్ లో సైతం నటించి మెప్పించింది. ఆ విధంగా తెలుగు, కన్నడ, తమిళ్ ఆడియన్స్ కి షర్మిత గౌడ సుపరిచితురాలే. బ్రహ్మముడి సీరియల్ లో తన విలనీ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది. బ్రహ్మముడి సీరియల్ కి షర్మిత సైతం ఓ ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు.
Also Read: తమ్ముడు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా..?
ఇక ఇంస్టాగ్రామ్ లో షర్మిత గ్లామర్ షోకి అడ్డే లేదు. బికినీ ఫోజులలో మైండ్ బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కి అప్డేట్స్ ఇస్తూ అందుబాటులో ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో షర్మితను దాదాపు రెండు లక్షల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా అమ్మడు బీచ్ వెకేషన్ కి వెళ్ళింది. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ అయ్యాయి.
View this post on Instagram