Pawan Kalyan: వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కక్ష లేదని డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. 2029 లో వస్తే మీ అంతు చూస్తామంటే మీరు రావాలి కదా .. ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం అంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రౌడీయిజం, గూండాయిజంతో భయపెట్టి వేధించారు. భూదోపిడీలకు అడ్డు లేకుండా పోయిందని అన్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం నేను నెల్లూరు జిల్లా కలిగిరిలో పెరిగాను – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/JmvCb3kFjC
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025