Pakistan Terror Attack: ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడిచేశారు. 26 మందిని కాల్చి చంపారు. ఈ ఘటన అందరినీ కలచివేసింది. ఈ దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. తర్వాత పాకిస్తాన్ జరిపిన ప్రతిదాడులను తిప్పి కొట్టింది. ఆ దేవంలోని 11 ఎయిర్ బేస్‌లను ధ్వసం చేసింది. కరాచీ ఎయిర్ పోర్టును కూడా భారత్ అధీనంలోకి తెచ్చుకుంది. మొత్తంగా ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ దేశం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ రాజకీయ, సైనిక నాయకుల ప్రకటనలు, ఇటీవలి సైనిక చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు భారత్‌పై మరో పహల్గాం తరహా దాడి జరిగే అవకాశాన్ని సూచిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ చిత్తు..
ఆపరేషన్ సిందూర్‌లో భారత్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు చేసి, సైనిక, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. కరాచీ ఎయిర్‌పోర్టు సమీపంలో దాడులు, విమానాలను తరిమి కొట్టడం ద్వారా భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని చాటింది. ఎస్–400 క్షిపణి వ్యవస్థ, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతలు పాకిస్తాన్ యొక్క దాడి సామర్థ్యాన్ని అడ్డుకున్నాయి. ఈ ఓటమి పాకిస్తాన్ సైనిక, రాజకీయ వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తించింది, దీంతో ప్రతీకార చర్యలకు ప్రయత్నించే అవకాశం ఉంది.
ఆసిఫ్ మునీర్‌పై ఒత్తిడి
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ నిర్ణయాలు, భారత్‌పై దాడులకు సంబంధించిన వ్యూహాలు దేశంలో వివాదాస్పదంగా మారాయి. సైనిక కమాండర్లతో సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలు ఆపరేషన్ సిందూర్‌లో తీవ్ర నష్టానికి దారితీశాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఈ అస్థిరత మునీర్‌ను రాజకీయ ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు భారత్‌పై దాడులకు ప్రేరేపించవచ్చు. పాకిస్తాన్ నాయకుల యుద్ధోన్మాద ప్రకటనలు, అణ్వాయుధ బెదిరింపులు ఈ ఉద్రిక్తతను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
Also Read: రెండు వారాల్లో 900 భూకంపాలు.. జపాన్ లోనే అత్యధికంగా భూకంపాలు ఎందుకు వస్తాయి? ఏంటా కథ?
మరో దాడికి కొత్త వ్యూహం..
పాకిస్తాన్ సంప్రదాయ ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు ధ్వంసమైన తర్వాత, బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు నిఘా సమాచారం సూచిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు ఈ మార్గాన్ని ఉపయోగించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, చారిత్రక ఘర్షణలు ఈ వ్యూహానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. భారత్ ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సరిహద్దు భద్రత, నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
అమర్‌నాథ్ యాత్రీకులే టార్గెట్?
అమర్‌నాథ్ యాత్ర సమయంలో జమ్మూ కశ్మీర్‌లో భారీ సంఖ్యలో యాత్రీకులు రావడం ఉగ్రవాదులకు ఆకర్షణీయ లక్ష్యంగా మారుతుంది. లష్కర్–ఎ–తోయిబా, జైష్–ఎ–మహమ్మద్ వంటి సంస్థలు ఈ సమయంలో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నాయని నిఘా హెచ్చరికలు సూచిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా, భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత్ ఈ బెదిరింపులను ఎదుర్కొనేందుకు యాత్ర మార్గంలో డ్రోన్ నిఘా, సైనిక బలగాలను, సీసీటీవీ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది.
Also Read: ఐటీ ఉద్యోగుల కోసం ఏకంగా ఓ దేశం.. భారతీయుడు సృష్టిస్తున్న ఈ అద్భుతం గురించి తెలుసుకోవాల్సిందే!
ఓటములను విజయాలుగా..
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ భారత్‌తో జరిగిన 1965, 1971, కార్గిల్ యుద్ధాల్లో ఓటమి చెందినప్పటికీ, వాటిని విజయాలుగా చిత్రీకరించే సంస్కృతిని కొనసాగిస్తోంది. 1965 యుద్ధంలో ఓడినా సెప్టెంబర్ 6ను ఆర్మీ దినంగా జరుపుకోవడం దీనికి ఉదాహరణ. ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా, నష్టాలను దాచిపెట్టి, షహీద్‌ల సంస్కృతిని ప్రచారం చేస్తూ, మరో దాడికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ చారిత్రక వైఖరి పాకిస్తాన్‌ను దూకుడు వైఖరికి ప్రేరేపిస్తోంది.