Homeఎంటర్టైన్మెంట్What happened to Dil Raju: దిల్ రాజుకు ఏమైంది? ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్న స్టార్...

What happened to Dil Raju: దిల్ రాజుకు ఏమైంది? ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్న స్టార్ ప్రొడ్యూసర్!

What happened to Dil Raju: డిస్ట్రిబ్యూటర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన దిల్ రాజు(DIL RAJU) స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఏర్పాటు చేసిన దిల్ రాజు మొదటి ప్రయత్నంగా దిల్ సినిమా నిర్మించారు. నితిన్ హీరోగా దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన దిల్ సూపర్ హిట్. డిస్ట్రిబ్యూటర్ రమణారెడ్డి కాస్త ప్రొడ్యూసర్ దిల్ రాజు అయ్యాడు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన రెండో చిత్రం ఆర్య. అల్లు అర్జున్ కి ఫాలోయింగ్ తెచ్చిన ఆర్య మరో సూపర్ హిట్. వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన దిల్ రాజుకు భద్ర రూపంలో మరో బంపర్ హిట్. ఇక బొమ్మరిల్లుతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు.

వరుసగా నాలుగు భారీ విజయాలు సొంతం చేసుకున్న దిల్ రాజు.. స్టార్ ప్రొడ్యూసర్ హోదా రాబట్టాడు. స్టార్స్ తో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా అంటే పక్కా హిట్ అనేంత నమ్మకాన్ని దిల్ రాజు సంపాదించాడు. రెండు దశాబ్దాలకు పైగా దిల్ రాజు విజయ ప్రస్థానం కొనసాగుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూనే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఏర్పాటు చేసుకున్నాడు. ఓ సినిమా విడుదల చేయాలంటే దిల్ రాజు అనుమతి కావాలనే రేంజ్ లో పరిశ్రమను శాసించాడు.

Also Read: హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఈవెంట్లో జాతి రత్నాలు అనుదీప్ కు ఘోర అవమానం.. వైరల్ వీడియో…

అయితే కొన్నేళ్లుగా దిల్ రాజు ప్రభావం తగ్గుతూ వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ లో కూడా దిల్ రాజు కింగ్ గా ఉన్నాడు. ఆయన అధిపత్యానికి గండి కొట్టేందుకు మైత్రీ మూవీ మేకర్స్ వంటి బడా నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది. మరోవైపు దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. గత దశాబ్దకాలంలో దిల్ రాజు హిట్ పర్సెంటేజ్ బాగా పడిపోయింది. ఫిదా, ఎఫ్ 2, బలగం, సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే క్లీన్ హిట్స్ గా ఉన్నాయి.

శాకుంతలం, గేమ్ ఛేంజర్ చిత్రాలు దిల్ రాజును భారీగా ముంచేశాయి. గుణశేఖర్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న శాకుంతలం మూవీ నిర్మాణ భాగస్వామిగా మారి దిల్ రాజు మూల్యం చెల్లించాడు. శాకుంతలం నష్టాల మీద దిల్ రాజు ఓపెన్ గా మాట్లాడటం విశేషం. గేమ్ ఛేంజర్ అంతకు మించిన షాక్ ఇచ్చింది. శంకర్ ఏళ్ల తరబడి సినిమా తీయడంతో పాటు బడ్జెట్ పెంచేయడంతో గేమ్ ఛేంజర్ వలన దిల్ రాజు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్ రిలీజ్ తమ్ముడు(Thammudu) ప్రాధమికంగా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో అసలు మేటర్ లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: పవన్ కళ్యాణ్ బ్యానర్ కి అభిమాని రక్తాభిషేకం..సంచలనం రేపుతున్న వీడియో!

ఈ పరిణామాల నేపథ్యంలో దిల్ రాజుకు ఏమైందన్న సందేహాలు మొదలయ్యాయి. స్క్రిప్ట్ జడ్జిమెంట్ లో ఒకప్పుడు తనకు తిరుగు లేదని నిరూపించుకున్న దిల్ రాజు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడని చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తుంది. దిల్ రాజు కమ్ బ్యాక్ అవ్వాలని, ఆయన బ్యానర్ లో మంచి చిత్రాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular