Bigg Boss 5 Telugu: తాజాగా బిగ్బాస్ ఐదో సీజన్లో సన్నీ విన్నర్ గా నిలిచాడు. అయితే ఈ సీజన్ కూడా అబ్బాయే బిగ్ బాస్ విన్నర్ గా నిలవడంతో పాటు ఈ సీజన్లో అమ్మాయి లందర్నీ ముందే ఎలిమినేట్ చేయడంతో సోషల్ మీడియాలో కొంతమంది దీనిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. టాప్ 5 లో ఒకే ఒక అమ్మాయి ఉండడం ఆమెను కూడా ఫస్ట్ ఎలిమినేట్ చేసెయ్యడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొదటి 4 సీజన్స్ కూడా అబ్బాయిలు టైటిల్ గెలిచారు. కనీసం ఐదో సీజన్ అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే ఈ సారి కూడా అబ్బాయిలకు కప్పు ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ రన్నరప్ వరకు వచ్చినా విన్నర్ గా మేల్ కంటెస్టెంట్స్ నే ప్రకటించారు.
హౌస్ లో చివరి వరకు అమ్మాయిలని గ్లామర్ కోసం ఉపయోగిస్తున్నారంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
Also Read: అలాంటి వారినే బిగ్బాస్ టైటిల్స్ ఎందుకు వరిస్తున్నాయి?
అమ్మాయిలకి ఓటింగ్స్ బాగానే వస్తున్నా వాళ్ళని కేవలం గ్లామర్ షోకి మాత్రమే బిగ్ బాస్ వాడుతుంది అని కొంతమంది సీరియస్ అవుతున్నారు. తొలి సీజన్ శివబాలాజీ, రెండో సీజన్ కౌశల్, మూడో సీజన్ రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ అభిజిత్ టైటిల్ తీసుకున్నారు. ఐదోసారి సన్నీ టైటిల్ గెలిచాడు. బిగ్ బాస్ షోలో అమ్మాయిలు ఉన్నా కూడా కేవలం గ్లామర్ కోసమే కొన్ని చోట్ల వాడారు.
Also Read: ఆ నలుగురు బిగ్ బాస్ విన్నర్స్ ఏం సాధించారు?.. సన్నీ పరిస్థితి ఏమవుతుంది?
ఇంట్లో వాళ్లంతా అందాలను ఆరబోస్తూ కెమెరా లకు ఫోజులివ్వడమే సరిపోయింది. అంతేకాక జెంట్ కంటెస్టెంట్స్ తో హగ్గులు, ముద్దులు, రొమాన్స్ కోసం వాడుతున్నారు లేడీ కంటెస్టెంస్ట్ ని. ఇప్పటికే అయిదు సీజన్లుగా ఇదే జరుగుతుంది. దీంతో కొన్ని మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి ఆరో సీజన్ అయినా దీనికి ఫుల్ స్టాప్ పెట్టి లేడీ కంటెస్టెంట్ ని గెలిపిస్తుందా లేక ఎప్పటిలాగే చేస్తుందా చూడాలి.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More