https://oktelugu.com/

Bheemla Nayak Heroine: ‘భీమ్లా నాయక్‌’ హీరోయిన్ కి త్రివిక్రమ్ సపోర్ట్, కారణం ఏమిటి ?

Bheemla Nayak Heroine: పక్కింటి పిల్లలాంటి తెలుగుదనం ఉట్టిపడే పక్క రాష్ట్రాల బ్యూటీలంటే టాలీవుడ్‌ మేకర్స్ కి ఎప్పుడూ మోజే. అందుకే, రష్మిక మందన్నా, కృతి శెట్టి లాంటి భామలు తెలుగులో భారీ ఫాలోయింగ్ ను తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు తెరపై మన తెలుగందాలు రాణించలేకపోతున్నాయి. అయినా తెలుగు మేకర్స్ కి కావాల్సింది.. అందాల భామలు, తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది అందాల విందు. ఇక హీరోయిన్లు ఎక్కడ నుంచి వచ్చారు అన్నది అనవసరం. ప్రస్తుతం తన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2022 / 02:06 PM IST

    Bheemla Nayak Heroine

    Follow us on

    Bheemla Nayak Heroine: పక్కింటి పిల్లలాంటి తెలుగుదనం ఉట్టిపడే పక్క రాష్ట్రాల బ్యూటీలంటే టాలీవుడ్‌ మేకర్స్ కి ఎప్పుడూ మోజే. అందుకే, రష్మిక మందన్నా, కృతి శెట్టి లాంటి భామలు తెలుగులో భారీ ఫాలోయింగ్ ను తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు తెరపై మన తెలుగందాలు రాణించలేకపోతున్నాయి. అయినా తెలుగు మేకర్స్ కి కావాల్సింది.. అందాల భామలు, తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది అందాల విందు.

    ఇక హీరోయిన్లు ఎక్కడ నుంచి వచ్చారు అన్నది అనవసరం. ప్రస్తుతం తన అందాలనవ్వుల సొగసులో తెలుగుదనం చూపిస్తోన్న సంయుక్తా మీనన్‌ పట్ల – టాలీవుడ్ మేకర్లు ఆసక్తి చూపిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇదీ అని చెప్పడానికి వీల్లేని అందంతో కట్టిపడేస్తోన్న సంయుక్తా మీనన్‌ కి -చాన్స్‌లు ఇచ్చేందుకు మేకర్లు పోటీ పడుతున్నారు.

    Samyuktha Menon

    ఇప్పటికే ‘బింబిసార’ నుంచి విడుదలైన గ్లింప్స్‌తో కుర్రకారు మతిపోగొట్టింది సంయుక్తా మీనన్‌. అమాయకపు మోముపై తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సంయుక్తా యువతరానికి గిలిగింతలు పెట్టేసింది. నిజానికి సంయుక్తా మీనన్‌ మంచి నటి కూడా. అందంతో పాటు అభినయం కూడా ఉంటే.. ఆ హీరోయిన్ని బిగ్ స్క్రీన్‌పై చూడ్డానికి ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీ సైతం ఆసక్తి చూస్తోంది.

    Also Read: ‘Thank you’ 6 Days Collections: ‘థాంక్యూ’ 6 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిజల్ట్ ఇదే !

    అందుకే, టాలీవుడ్‌లో సంయుక్తా మీనన్‌ కి వరుస చాన్స్ లు వస్తున్నాయి. ఇంతకుముందు.. ‘భీమ్లా నాయక్‌’ చిత్రంలో మెరిసిన సంయుక్త మీనన్‌.. త్రివిక్రమ్ ను కూడా బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో చిన్న పాత్రే అయినా, ఆమె నటన మాత్రం గుర్తుండిపోతుంది. అందుకే, ఆమెకు ‘వినోదయ సీతమ్’ రీమేక్ గా రాబోతున్న పవన్ సినిమాలో సాయితేజ్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్.

    Trivikram, Samyuktha Menon

    తాజాగా సంయుక్తా మీనన్‌ కి, నితిన్ సరసన నటించే మరో ఆఫర్‌ వచ్చింది. మరి ఈ రెండు సినిమాలతో సంయుక్తా మీనన్‌ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటే ఇక ఈ టాలెంటెడ్ హీరోయిన్ కి తెలుగులో తిరుగు ఉండదు. స్టార్ డైరెక్టర్లు సైతం తమ తరువాతి ప్రాజెక్టుల్లో మెయిన్ హీరోయిన్ గా అమ్మడుకు చాన్స్‌లిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి సంయుక్తా మీనన్‌ లక్ ఎలా ఉందో చూడాలి.

    Also Read: Crazy Heroine: క్రేజీ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం.. వాటి కోసమే బరితెగింపు !

    Tags