https://oktelugu.com/

Hari Hara Veera Mallu Teaser: ఆగష్టు 15 వ తారీఖున విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ టీజర్..ఫాన్స్ కి ఇక పండగే

Hari Hara Veera Mallu Teaser: రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి భారీ హిట్స్ ని అందుకొని మంచి ఊపు మీదున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరి హర వీర మల్లు అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత AM రత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు..కెరీర్ లో మొదటిసారి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2022 / 02:09 PM IST
    Follow us on

    Hari Hara Veera Mallu Teaser: రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి భారీ హిట్స్ ని అందుకొని మంచి ఊపు మీదున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరి హర వీర మల్లు అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత AM రత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు..కెరీర్ లో మొదటిసారి పవన్ కళ్యాణ్ పీరియాడిక్ డ్రామా లో నటిస్తుండడం తో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి..గత ఏడాది విడుదల చేసిన ఈ సినిమా గ్లిమ్స్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..పవన్ కళ్యాణ్ ని ఆ గెటప్ లో చూసిన అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి..దానికి తోడు హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా కోసం పని చేస్తుండడం తో కచ్చితంగా అదిరిపొయ్యే ఔట్పుట్ వస్తుందని బలంగా నమ్ముతున్నారు..ఇప్పటికే 60 శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత కొద్దీ కాలం నుండి షూటింగ్ ని జరుపుకోవడం లేదు..దానికి కారణం సెకండ్ హాఫ్ స్టోరీ కి సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని కీలక మార్పులు చేర్పులు డైరెక్టర్ క్రిష్ కి సూచించాడట..ఇటీవలే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ కి వినిపించాడట డైరెక్టర్ క్రిష్..పవన్ కళ్యాణ్ ఈ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు..ఆగష్టు 2 వ వారం నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది..కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం , కన్నడం , హిందీ మరియు మలయాళం వంటి బాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తాని చాటుతాడని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు..ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ చేసుకునే వార్త ఏమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఆగష్టు 15 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది..ఈ టీజర్ అభిమానుల అంచనాలను వేరే లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఉండబోతోందట..పవన్ కళ్యాణ్ ని మునుపెన్నడూ చూడండి రేంజ్ మాస్ యాంగిల్ లో ఈ టీజర్ ద్వారా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది..మరి అది నిజమో కాదో తెలియాలంటే ఆగస్టు 15 వరుకు వేచి చూడాల్సిందే.

    Hari Hara Veera Mallu

    Recommended Videos



    Tags