Trivikram Wife Soujanya: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలంటే ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. కామెడీ,సెంటిమెంట్, రిలేషన్ షిప్ తో కూడిన ఆయన సినిమాల్లో కొత్తదనం ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు డైలాగ్స్ రచయిత గానే కాకుండా.. సక్సెస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. వీటికి తోడు ఆయన కొన్ని నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హారిక బ్యానర్ ను ఆయన వెనక ఉండి నడిపిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అటు సితార బ్యానర్ కూడా త్రివిక్రమ్ అండతోనే సాగుతుందని అంటారు. ఇలా ఆల్ రౌండర్ ఉన్న ఈ క్రేజీ డైరెక్టర్ సతీమణి కూడా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.. ఈ విషయం తెలిసి అంతా షాక్ కు గురయ్యారు.

ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు సౌజన్యను త్రివిక్రమ్ 2020లో పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే రవీంద్రభారతిలో సౌజన్య భరతనాట్యం సందర్భంగా కలిశారు. ఆ తరువాత సీతారామశాస్త్రి చొరవతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయిన తరువాత ఆయన సతీమణి కూడా ఆయనకు విలువైన సలహాలు ఇస్తుండేదని అంటారు. ఇలా ఆమె సినిమాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు.
ఇప్పుడు ఆమె ఏకంగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే నటిగా కాకుండా నిర్మాణ సంస్థలో అడుగుపెట్టారు. సితార బ్యానర్ పై ‘బుట్టబొమ్మ’ సినిమా నిర్మాణమవుతోంది. దీనికి సంబంధించిన టీజర్ సోమవారం రిలీజ్ చేశారు. మలయాళంలో హిట్టుకొట్టిన ‘కప్పెల’ సినిమా రీమేక్ ఇది. పల్లెటూరికి చెందిన అమ్మాయి సిటీ కుర్రాడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది..? అనేది సినిమా కాన్సెప్ట్.

ఈ సినిమా నిర్మాతగా సితార నాగవంశీ తో పాటు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె భరతనాట్య కళాకారిణిగా పేరొందారు. ఇప్పుడు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. అయితే సినీ నిర్మాణంలో ఆమె ఎంత వరకు జోక్యం చేసుకుంటారో అనేది తెలియాల్సి ఉంది.. కానీ తన సతీమణి పేరున్న అన్నీ వ్యవహారాలు త్రివిక్రమ్ చూసుకునే అవకాశం ఉంది. దీంతో ఇన్నాళ్లు మాటల రచయితగా.. డైరెక్టర్ గా కొనసాగిన ఇప్పుడు తివిక్రమ్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారిపోయాడు.