Allu Arjun New Movie Teaser Release Date: ‘పుష్ప 2 ‘ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) హీరో గా , సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత నెల 22 వరకు నాన్ స్టాప్ గా ముంబై లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగింది. ఇక ఆ తర్వాత తన సోదురుడు అల్లు శిరీష్ పెళ్లి కారణంగా అల్లు అర్జున్ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. అభిమానులకు ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ తప్ప, మరో అప్డేట్ ఎవరికీ తెలియదు. టైటిల్ కూడా ఇప్పటి వరకు ఖరారు అవ్వలేదు. అయితే ఈ సినిమాకు సంగీతం అందిసున్న సాయి అభయంకర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో , ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్!
ఆయన మాట్లాడుతూ ‘అట్లీ గారికి నా మీద ఉన్న నమ్మకం సాధారణమైనది కాదు. ఆయన నేను మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యినప్పుడు అవకాశం ఇవ్వలేదు. నేను ఆయన కోసం కంపోజ్ చేసిన ఒకే ఒక్క సాంగ్ , ఇంత పెద్ద పాన్ ఇండియన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశం ఇచ్చాడు. నాకు సినీ ఇండస్ట్రీ లో వచ్చిన మొట్టమొదటి అవకాశం ఇదే. ఆయన నాకు అందించే ప్రోత్సాహాన్ని జీవితం లో మర్చిపోలేను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను. అల్లు అర్జున్ గారి పుట్టిన రోజుకి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు సాయి అభయంకర్. అంటే అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ , గ్లింప్స్ వీడియో విడుదల చేయబోతున్నారు అన్నమాట.
సూపర్ హీరో జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లు గా నటిస్తుండగా, రష్మిక మందాన విలన్ రోల్ లో నటిస్తోందని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ లోపు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉండడం బాగా సమయం తీసుకునే అవకాశం ఉంది.